AP Weather Report: నైరుతి దూకుడు.. బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం!

నైరుతి రుతుపవనాలు ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాలను ఆనుకుని..

AP Weather Report: నైరుతి దూకుడు.. బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం!
AP Weather Report
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 25, 2023 | 7:43 AM

విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 7.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి వైపుకు సాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది.

దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఏపీలో వర్షాలుపడనున్నాయని తెల్పింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందని తెల్పింది.

ఉత్తర కోస్తాంధ్రలో గంటకు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వివరించింది. అల్పపీడనం నేపథ్యంలో సముద్రం ఉధృతంగా ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.