Andhra Pradesh: ‘రాజా వారి చేపల చెరువులు’.. తవ్వేస్తారు.. పంటలకు వెళ్లే నీళ్లు మళ్లిస్తారు.. ఇదో దందా..!

Mylavaram News: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అక్రమ చేపల చెరువులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పచ్చని పొలాల మధ్య అక్రమ చేపల చెరువుల ఇష్టారీతిన తవ్వేస్తున్నారు. అయితే.. పంట పొలాలకు వెళ్లే నీళ్లను చేపల చెరువులకు అక్రమంగా తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు.

Andhra Pradesh: ‘రాజా వారి చేపల చెరువులు’.. తవ్వేస్తారు.. పంటలకు వెళ్లే నీళ్లు మళ్లిస్తారు.. ఇదో దందా..!
Fish Ponds
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 25, 2023 | 8:26 AM

Mylavaram News: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నియోజకవర్గంలో రాజా వారి చేపల చెరువులు.. అవును.. ఇది నిజమే.. మైలవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అధికారుల కళ్ళు గప్పి ఇష్టారాజ్యంగా చేపల చెరువులు తవ్వుతున్నారు కొందరు అక్రమార్కులు. అనుమతి లేకుండా కొన్నిచోట్ల.. అనుమతికి మించి మరికొన్ని చోట్ల దర్జాగా చేపల చెరువుల తవ్వకాలు యథేశ్చగా కొనసాగుతున్నాయి. కవులూరు, తోలుకోడు, గణపవరం, వెల్వడం, మైలవరం ప్రాంతాల్లో పచ్చటి పంట పొలాల మధ్య అగాదాల్లా చేపల చెరువులు పుట్టుకొస్తున్నాయి. అంతేకాదు.. మైలవరంలో చెరువు నుండి రైతుల పంట పొలాలకు నీళ్లు వెళ్లే పంప్ హౌస్ ద్వారా చేపల చెరువులకు నీళ్ళు మళ్ళిస్తున్నారు కొందరు యజమానులు. ఇలాంటి పనులతో భవిష్యత్‌లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెరువు చుట్టుపక్కల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక.. మైలవరంలో నియోజకవర్గంలో రాజాల్లా చేపల చెరువులు తవ్వేస్తున్నా.. అధికారులు చోద్యం చూస్తుండటంపై పెద్దయెత్తున ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మామూళ్ల మత్తులో జోగుతూ అక్రమ చేపల చెరువుల తవ్వకాల వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని రైతులు మండిపడుతున్నారు. ఇదిలావుంటే.. ఆ చేపల చెరువుల్లో బ్రాయిలర్‌కోళ్ల వ్యర్థాలు, కుళ్లిన మాంసాన్ని ఆహారంగా వేస్తుండటంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోళ్ళ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వేయటం.. వాటిని మనుషులు తినడం ద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయని ఆవేదన చెందుతున్నారు మైలవరం ప్రజలు.

అంతేకాదు.. బ్రాయిలర్‌ కోళ్ల వ్యర్థాలు, కుళ్లిన మాంసంతో చేపల చెరువుల చుట్టుపక్కల ప్రదేశాలు కంపు కొడుతున్నాయని చెప్తున్నారు. వ్యర్థాలతో పర్యావరణం పాడవుతున్నా.. చెరువుల్లో నీళ్ళు యథేశ్చగా దోచే‌స్తున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు, ప్రజలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..