Bihar: మెచి నదిపై కుప్పకూలిన మరో బ్రిడ్జి.. వారాల వ్యవధిలో రెండోసారి
బిహార్‌లో మరో భారీ బ్రిడ్జి కుప్పకూలింది. జూన్ 4న ఖగారియా జిల్లాలో గంగానదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. వారాల వ్యవధిలోనే బీహార్ రాజధాని పట్నాకు..
పట్నా: బిహార్‌లో మరో భారీ బ్రిడ్జి కుప్పకూలింది. జూన్ 4న ఖగారియా జిల్లాలో గంగానదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. వారాల వ్యవధిలోనే బీహార్ రాజధాని పట్నాకు 400 కిలోమీటర్ల దూరంలోని కిషన్‌గంజ్ జిల్లాలో మెచి నదిపై నిర్మిస్తోన్న మరో బ్రిడ్జిలోని కొంత భాగం శనివారం (జూన్ 24) ధ్వంసమైంది. కిషన్‌గంజ్, కతిహార్ ప్రాంతాల మధ్య నిర్మాణంలో ఉన్న ఈ వంతెన కుప్పకూలడం ప్రస్తుతం వివాదాశంగా మారింది.
కేంద్ర ప్రభుత్వ భారతమాల ప్రాజెక్టులో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆరు పిల్లర్ల వంతెనను నిర్మిస్తోంది. దాదాపు రూ.1,080 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దీని నిర్మాణ పనులు గతేడాది ప్రారంభమయ్యాయి. వంతెన నిర్మాణం పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభించాల్సి ఉంది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఎన్‌హెచ్‌ఏఐకి చెందిన అత్యున్నత స్థాయి నిపుణుల బృందం ఆదివారం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతుందని వర్గాలు తెలిపాయి.
#WATCH | Pillar of an under-construction bridge on Mechi River which connects Katihar and Kishanganj districts in Bihar, caves in near Gori village on NH-327E. pic.twitter.com/VsYAP9xnl7
— ANI (@ANI) June 24, 2023
డిప్యూటీ సీఎం తేజస్వీ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ఈ వంతెనను ఎన్‌హెచ్‌ఏఐ నిర్మిస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని’ ఆయన తెలిపారు. సుల్తంగంజ్-అగువానీ ఘాట్ వంతెన కూలిపోవడంతో రాష్ట్రంలోని బీజేపీ, మహాకూటమి పార్టీల మధ్య పొలిటికల్ వార్ ప్రారంభమైంది. బీహార్ వరుసగా నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిగతా బ్రిడ్జిలైనా పటిష్టంగా ఉన్నాయా.. లేదా అవి కూడా ఏ క్షణానైనా కూలిపోయే స్థితిలో ఉన్నాయా అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు చేపడుతున్నామని చెబుతూ నాసిరకం వంతెనలు నిర్మించి.. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారంటూ మండిపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.