Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీ ఇండస్ట్రీలో కలకలం.. డ్రగ్స్‌ కేసులో తెరపైకి ఇద్దరు యువ నటుల పేర్లు!

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కొకైన్‌ రవాణా చేస్తుండగా జూన్‌ 14న కబాలి నిర్మాత కేపీచౌదరిని రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పెడ్లర్లతో పరిచయాలున్న పలువురి పేర్లు బయటకొస్తున్నాయి. ఈ జాబితాలో తాజాగా ఇద్దరు..

సినీ ఇండస్ట్రీలో కలకలం.. డ్రగ్స్‌ కేసులో తెరపైకి ఇద్దరు యువ నటుల పేర్లు!
Drugs Case
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 25, 2023 | 10:38 AM

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కొకైన్‌ రవాణా చేస్తుండగా జూన్‌ 14న కబాలి నిర్మాత కేపీచౌదరిని రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పెడ్లర్లతో పరిచయాలున్న పలువురి పేర్లు బయటకొస్తున్నాయి. ఈ జాబితాలో తాజాగా ఇద్దరు యువ నటుల పేర్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఐతే వారెవరన్నది పోలీసులు బయటపెట్టడం లేదు.

నిందితుడు కేపీ చౌదరి ఫోన్లలో వందల ఫొటోలు, సెల్‌ నంబర్లను పోలీసులు గుర్తించారు. వారిలో టాలీవుడ్, కోలీవుడ్ సినీ నటులు, రాజకీయ, వ్యాపారవర్గాలకు చెందిన బడా బాబుల పేర్లు ఉన్నట్లు నిర్ధారించారు. రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న 12 మందితో ఫోన్‌ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే 11 అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలను సైతం పోలీసులు దృష్టిసారించారు. కేపీచౌదరి దందాలో ఎంతమందికి డ్రగ్స్‌ విక్రయించాడు, ఎందరు కొకైన్‌ వినియోగిస్తున్నారనే దానిపై స్పష్టత వచ్చిన తర్వాతనే చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం ఎవరికీ నోటీసులు ఇవ్వబోమని పోలీసులు తెలిపారు.

ఇక రిమాండ్‌ రిపోర్టులో పేర్లున్న వారిలో కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ.. కేపీ చౌదరి ఫోన్‌లో తమ నంబర్లు ఉన్నంత మాత్రాన తమను డ్రగ్స్‌ వాడేవారి జాబితాలో చేర్చుతారా ? అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని మాధ్యమాలు, మీడియా సంస్థలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ నటి అషురెడ్డి ఇన్‌స్టా ఖాతాలో పోస్టు పెట్టింది. సామాజిక మాధ్యమాల్లో మరో నటి ఫొటోలు చక్కర్లు కొడుతుండటంతో సదరు నటి కూడా స్పందించింది. అవి తన వ్యక్తిగతమని, కేసులో పోలీసులకు సహకరిస్తానంటూ స్పష్టం చేసింది. ఇక ఈ కేసులో ఇప్పటివరకు బయటకు వచ్చిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి. 

కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేకపోతున్నారు.. అతను మాత్రం ఎలా ఎక్కాడు
కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేకపోతున్నారు.. అతను మాత్రం ఎలా ఎక్కాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మ్యాంగో.. దీని ధర తెలిస్తే..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మ్యాంగో.. దీని ధర తెలిస్తే..
క్యాన్సర్‌ను పారదోలే అద్భుత ఫలం.. కనిపిస్తే అస్సలు వదలొద్దు..
క్యాన్సర్‌ను పారదోలే అద్భుత ఫలం.. కనిపిస్తే అస్సలు వదలొద్దు..
ఇతను తలపై కత్తెర పెడితే మినిమం లక్ష..ఎందుకంటే..
ఇతను తలపై కత్తెర పెడితే మినిమం లక్ష..ఎందుకంటే..
ఈ కోతికి అల్లరే కాదు.. ప్రేమ కూడా ఎక్కువే.. వీడియో
ఈ కోతికి అల్లరే కాదు.. ప్రేమ కూడా ఎక్కువే.. వీడియో
పెంపుడు కుక్కతో విమానం ఎక్కబోయిన మహిళ..సిబ్బంది అడ్డుకోవడంతో..!
పెంపుడు కుక్కతో విమానం ఎక్కబోయిన మహిళ..సిబ్బంది అడ్డుకోవడంతో..!
దుబాయ్‌లోని దేవాలయంలో అల్లు అర్జున్‌ వీడియో
దుబాయ్‌లోని దేవాలయంలో అల్లు అర్జున్‌ వీడియో
పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు
పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..