Ileana Pregnancy: ప్రెగ్నెన్సీ జర్నీ.. అధికబరువుతో కలవర పడుతోన్న ఇలియానా.. !

పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేసింది గోవా బ్యూటీ ఇలియానా. బేబీ పంప్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేరు చేస్తున్న ఈ బ్యూటీ తండ్రి ఎవ్వరో మాత్రం చెప్పడం..

Ileana Pregnancy: ప్రెగ్నెన్సీ జర్నీ.. అధికబరువుతో కలవర పడుతోన్న ఇలియానా.. !
Ileana
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 25, 2023 | 9:05 AM

పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేసింది గోవా బ్యూటీ ఇలియానా. బేబీ పంప్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేరు చేస్తున్న ఈ బ్యూటీ తండ్రి ఎవ్వరో మాత్రం చెప్పడం లేదు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో నటి ఇలియానా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చింది. ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగడంపై ఆందోళన చెందుతున్నారా? అని ఓ అభిమాని ఇన్‌స్టాలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..

‘ఈ ప్రశ్న మొదట్లో నన్ను కలవరపెట్టింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అనేకమంది పదేపదే కామెంట్‌ చేస్తుంటారు. కానీ గత కొన్ని నెలలుగా నా శరీరంలో వస్తున్న మార్పులను సంతోషంగా స్వీకరిస్తున్నాను. ఇది అద్భుతమైన ప్రయాణం. నా చుట్టూ నన్ను ప్రేమించే వాళ్లున్నారు. నా లోపల నా బేబీ ఉంది. కాబట్టి ‘బరువు’ అనేది పెద్ద విషయం కాదు. ఇన్ని కిలోలు మాత్రమే పెరగాలనే నిబంధనలు పెట్టుకోలేదు. మీ శరీరం మాట వినండి. మీకు నచ్చింది చేయండంటూ రెడ్ హార్ట్ ఎమోజీతో రిప్లై ఇచ్చింది.

మొదటిసారి మీ బేబీ గుండెచప్పుడు విన్నప్పుడు మీకెలా అనిపించింది? అన్న ప్రశ్నకు ‘నేను అనుభవించిన అత్యంత ఆనందమైన క్షణాల్లో ఇది ఒకటి. ఎంత పొంగిపోయానో మాటల్లో వర్ణించలేను. కన్నీళ్లు, ఆనందం అన్ని భావోద్వేగాలు ఒకేసారి వచ్చాయి’ అని ఇలియానా బదులిచ్చింది. మినీ క్యారెట్లు, ఐస్‌క్రీం, పిజ్జా ఎక్కువగా తినాలనిపిస్తోందని తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.