Vana Pujalu: తొలకరి పలకరింపు .. వనంలో పూజలను చేసి.. చల్లగా చూడమని నేతకాని గ్రామస్థుల పూజలు

తొలకరి చినుకులతో తెలుగురాష్ట్రాలను పకలరించాయి. తొలకరి చినుకు పడగానే పుడమితల్లి పరవశించింది. వేసవితాపంతో అల్లాడిన ప్రజలు సేదదీరుతున్నారు. కృతజ్ఞతగా ప్రకృతి మాతను తమదైనశైలిలో ఆరాధిస్తున్నారు. తాజాగా ములుగు జిల్లా వాసులు తమ గ్రామాలను విడిచి వనాల బాట పట్టారు.

Vana Pujalu: తొలకరి పలకరింపు .. వనంలో పూజలను చేసి.. చల్లగా చూడమని నేతకాని గ్రామస్థుల పూజలు
Vana Puja In Ts
Follow us
Surya Kala

|

Updated on: Jun 26, 2023 | 10:30 AM

వేసవి తాపంతో అల్లాడిన పుడమి, మనసులకు తొలకరి జల్లుతో ఉపశమనం లభిస్తుంది. పుడమి పులకరిస్తుంది. మట్టివాసనతో మనసు పరవశిస్తుంది. అన్నదాత ఆనందం వ్యక్తం చేస్తాడు. కొంత ఆలస్యమైనా రుతుపవనాలు తమ పయనాన్ని కొనసాగించాయి. తొలకరి చినుకులతో తెలుగురాష్ట్రాలను పకలరించాయి. తొలకరి చినుకు పడగానే పుడమితల్లి పరవశించింది. వేసవితాపంతో అల్లాడిన ప్రజలు సేదదీరుతున్నారు. కృతజ్ఞతగా ప్రకృతి మాతను తమదైనశైలిలో ఆరాధిస్తున్నారు. తాజాగా ములుగు జిల్లా వాసులు తమ గ్రామాలను విడిచి వనాల బాట పట్టారు. తొలకరి చినుకులు పడగానే అడవితల్లిని ఆరాధించడం వీరి ఆచారం. దాంతో ప్రకృతి ఆరాధనకోసం వనాలకు చేరి వనసమారాధన చేశారు.

జిల్లాలోని వెంకటాపురం మండలం బెస్తగూడెంకు చెందిన నేతకాని ప్రజలు ఉన్న ఊరిని విడిచి, పిల్లాపాపలతో, వనభోజనాలకు తరలి వెళ్లారు. అక్కడ వృక్షాలకు, చెట్లు, పుట్టలకు పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. అనంతరం బంధుమిత్రులంతా కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. తొలకరి జల్లులు పడగానే పంటలు బాగా పండాలని, పాడి అభివృద్ధి చెందాలని, అంటువ్యాధులు దరిచేరకుండా కాపాడాలని వనదేవతలను వేడుకుంటూ ప్రతి ఏటా ఇలా పూజలు చేయడం తమ ఆచారమని నేతకాని ప్రజలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..