‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ఇప్పుడు అర్ధమైంది..’ వీరేంద్ర సెహ్వాగ్ వైరల్ ట్వీట్
టాలీవుడ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్, కృతిసనన్ జంటగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ గత కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ నెల 16న సినిమా విడుదలైన నాటి నుంచి ఏదో ఒక విధంగా విమర్శలు ఎదుర్కొంటూనే..
టాలీవుడ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్, కృతిసనన్ జంటగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ గత కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇతిహాస కథ రామాయణాన్ని ఆధారంగా ఈ మువీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ నెల 16న సినిమా విడుదలైనప్పటి నుంచి ఆదిపురుష్ మువీ పలు రకాలుగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది.
కొందరు రామాయణాన్ని కొత్తగా చూపారంటూ సానుకూలంగా స్పందిస్తుంటే.. మరికొందరేమో ఆదిపురుష్ మువీ పేరుతో రామాయణాన్ని అపహాస్యం చేస్తున్నారని, కనీస అవగాహన లేకుండా ఈ సినిమాని చిత్రీకరించారంటూ ఫైర్ అవుతున్నారు. సినీ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు గత వారం రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటివరకూ వచ్చిన ఏ రామాయణ రచనలతోనూ దీనికి పోలిక లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు హనుమంతుడి సంభాషణలపై తీవ్ర దుమారం రేగడంతో చిత్రబృందం వాటిని మార్చిన విషయం తెలిసిందే. ఇక ఈ మువీలో సైఫ్ అలీ ఖాన్ పోషించిన రావణుడి పాత్రను చూసి ప్రతిఒక్కరూ పెదవి విరుస్తున్నారు.
Adipurush dekhkar pata chala Katappa ne Bahubali ko kyun maara tha 😀
— Virender Sehwag (@virendersehwag) June 25, 2023
తాజాగా ఈ మువీపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరెంద్ర సెహ్వాగ్ తనదైనా శైలిలో స్పందించాడు. ‘ఆదిపురుష్ సినిమా చూసిన తర్వాత బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అర్థమైందంటూ’ స్మైల్ ఎమోజీతో ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ తాజా ట్వీట్‌కు నెటిజన్లు భిన్న కామెంట్లు చేస్తున్నారు. కొందరు సెహ్వాగ్‌ను ట్రోల్ చేస్తుంటే, మరికొందరేమో ‘నిజమే వీరూ పాజీ.. కాస్త బెటర్‌గా తీయాల్సింది’ అంటూ మద్ధతిస్తున్నారు. ‘అరె మీరు కూడా మొదలుపెట్టారా, మళ్లీ ఈ మువీని ఎప్పుడు చూడబోతున్నారు, అన్ని అయిపోయాయి ఇప్పుడు ఆదిపురుష్ మువీపై దృష్టి పెడుతున్నారా, మిమ్మల్ని చూసిన తర్వాత ప్రజలు న్యాయాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారో నాకు అర్థమైంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.