Bajaj EV Offers: బజాజ్ ఈవీపై అదిరిపోయే ఆఫర్.. కేవలం రూ.3000కే మీ సొంతం…

భారతీయ మార్కెట్‌లో ఓ వెలుగు వెలిగిన బజాజ్ చేతక్ కూడా తన ఈవీ స్కూటర్‌తో మళ్లీ మార్కెట్‌లో తన హవా చూపించుకునేందుకు రెడీ అయ్యింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1.22 లక్షల  నుంచి రూ. 1.43 లక్షల ఎక్స్-షోరూమ్ వద్ద అందుబాటులో ఉంది.

Bajaj EV Offers: బజాజ్ ఈవీపై అదిరిపోయే ఆఫర్.. కేవలం రూ.3000కే మీ సొంతం…
Bajaj Ev
Follow us
Srinu

|

Updated on: Jun 28, 2023 | 4:15 PM

భారతదేశంలో ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి రక్షణకు కచ్చితంగా ఈవీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు ఈవీ స్కూటర్లను రిలీజ్ చేస్తున్నాయి. భారతీయ మార్కెట్‌లో ఓ వెలుగు వెలిగిన బజాజ్ చేతక్ కూడా తన ఈవీ స్కూటర్‌తో మళ్లీ మార్కెట్‌లో తన హవా చూపించుకునేందుకు రెడీ అయ్యింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1.22 లక్షల  నుంచి రూ. 1.43 లక్షల ఎక్స్-షోరూమ్ వద్ద అందుబాటులో ఉంది. అయితే ఈ స్కూటర్‌పై చాలా ఆసక్తి చూపించిన ప్రజలు ధర కాస్త ఎక్కువ ఉండేసరికి వెనకడుగు వేస్తున్నారు. దీంతో మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకోవడానికి కంపెనీ ఓ సరికొత్త ఈఎంఐ ప్లాన్‌తో ముందకొచ్చింది. బజాజ్ ఈ స్కూటర్ ఫీచర్లు, ఈఎంఐ గురించి ఓ లుక్కేద్దాం.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే దాదాపు 90 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. బజాజ్ చేతక్ ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 2.75 గంటల్లో పూర్తి ఛార్జ్ పొందుతుంది. ఇది 50.4 వీ/ 60.4 ఏహెచ్ శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్ రోడ్డుపై గంటకు 63 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. ఈ స్కూటర్ 50,000 కిలో మీటర్ల ఆన్‌రోడ్ రన్నింగ్ లేదా మూడు సంవత్సరాల వారెంటీతో వస్తుంది. బజాజ్ స్కూటర్ పదునైన హెడ్‌లైట్, టెయిల్‌లైట్, సూచికల ఎల్ఈడీ యూనిట్‌ను పొందుతుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఈ గొప్ప ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయి. బజాజ్ చేతక్ 4.08 కేడబ్ల్యూ బ్రష్‌లెస్ డీసీ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 16 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఎకో మోడ్‌లో 108 కిలో మీటర్ల మైలేజ్‌తో వస్తుంది. ఇది సాధారణ 5 ఏ పవర్ సాకెట్‌తో ఐదు గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అయితే ఇది కేవలం ఒక గంటలో 25 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.ఈ స్కూటర్ ముందువైపు సింగిల్-సైడెడ్ సస్పెన్షన్, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్‌ను పొందుతుంది. ఇది రైడర్‌ను కఠినమైన రోడ్లపై కుదుపుల నుంచి కాపాడుతుంది. అలాగే ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మారుస్తుంది. భద్రత కోసం కంపెనీ ఈ ఈవీ స్కూటర్ ముందు చక్రంలో డిస్క్ బ్రేక్, వెనుక చక్రంలో డ్రమ్ బ్రేక్ ఇచ్చింది. 

ఈఎంఐ స్కీమ్ ఇలా

ఈ లోన్ స్కీమ్ జాయి అవ్వడానికి రూ.13,000 డౌన్ పేమెంట్ చెల్లించాలి. దీని కోసం మీరు 9.7 శాతం వడ్డీ రేటుతో మూడేళ్లపాటు నెలకు రూ.3,692 వాయిదా చెల్లించాలి. డౌన్ పేమెంట్ మార్చడం ద్వారా ప్రతి నెలా వాయిదాను మార్చుకోవచ్చు. అదే సమయంలో ఈ లోన్ స్కీమ్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని బజాజ్ షోరూమ్‌ని సందర్శించడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..