Electric Scooters: మార్కెట్ కు ఎలక్ట్రిక్ కిక్..దేశంలో అమ్ముడైన టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!
ఎన్ని మోడల్స్ మార్కెట్ లోకి వచ్చినా కొన్ని మోడ్సల్స్ మాత్రమే వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఉన్న ఓలా ఎస్ 1, టీవీఎస్ ఐ క్యూబ్, ఎథర్ 450 ఎక్స్ లాంటి మోడల్స్ అమ్మకాల్లో సరికొత్త రికార్డును సృష్టించాయి.
ఎలక్ట్రిక్ వాహనాలు భారతీయ భవిష్యత్ వాహనాలుగా మారనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల స్థాయిని చూస్తుంటే ఇదే నిజమనిపిస్తుంది. పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా ఈవీ తయారుదారులు కొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకురావడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఎన్ని మోడల్స్ మార్కెట్ లోకి వచ్చినా కొన్ని మోడ్సల్స్ మాత్రమే వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఉన్న ఓలా ఎస్ 1, టీవీఎస్ ఐ క్యూబ్, ఎథర్ 450 ఎక్స్ లాంటి మోడల్స్ అమ్మకాల్లో సరికొత్త రికార్డును సృష్టించాయి. గత నెలలో భారతదేశంలో అధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్లపై మనమూ ఓ లుక్కేద్దాం.
ఓలా ఎస్ 1
ఓలా ఎస్ 1 నవంబర్ నెల విక్రయాల్లో అగ్రగామిగా ఉంది. 16305 యూనిట్లు డిస్పాచ్ చేయడంతో బెస్ట్ సెల్లరగా నిలిచింది. దీని ధర రూ. లక్ష (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 3.97 KW బ్యాటరీతో వస్తుంది. అలాగే గరిష్టంగా 90 కిలో మీటర్ల స్పీడ్ తో వెళ్తుంది.
టీవీఎస్ ఐ క్యూబ్
టీవీఎస్ ఐ క్యూబ్ గత నెలలో 10,166 యూనిట్లను విక్రయించడంతో ఓలా ఎస్ 1 కు సమీప పోటీదారుగా నిలిచింది. నవంబర్ 2021లో ఈ మోడల్ ఈవీలు కేవలం 699 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఆ విక్రయాలతో పోలిస్తే ఈ ఏడాది దుమ్ము దులిపింది. ఈ మోడల్ ఇటీవల చేసిన అప్ డేట్ ల కారణంగా భారీ విక్రయాలను నమోదు చేసిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఎథర్ 450 ఎక్స్
భారతదేశంలో గత నెలలో 9,737 యూనిట్ల ఎథర్ 450 ఎక్స్ విక్రయించారు. దీంతో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో మూడో స్థానాన్ని సంపాదించుకుంది. అదనంగా, కంపెనీ ఇటీవలే Ather 450X gen 3ని విడుదల చేసింది, ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ లాంగ్-రేంజ్ వెర్షన్, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 146 కి.మీ వెళ్తుంది.
బజాజ్ చేతక్
చేతక్ బండ్లు గతంలో ఓ క్రేజ్. దానికున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని చేతక్ ఎలక్ట్రిక్ వెర్షన్ లో తీసుకొచ్చి భారీ అమ్మకాలను నమోదు చేస్తుంది. ఈ స్కూటర్లు గత నెలలో 6,101 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ స్కూటర్ ధర రూ.1.5 లక్షలు ( ఎక్స్-షోరూమ్). ఇది ఎకో మోడ్ లో 95 కి.మి, స్పోర్ట్స్ మోడ్ లో 85 కి.మి పరిధిని అందిస్తుంది.
ఒకినివా ప్రైజ్ ప్రో
ఈ సంస్థ తన కస్టమర్ల కోసం తన లైన్ విస్తరించాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో ఒకినివా ప్రైజ్ ప్రో దుకాణదారులను ఆకర్షిస్తూనే ఉంది. ఈ కంపెనీ గత నెలలో 3,414 యూనిట్ల ప్రైజ్ ప్రో స్కూటర్లను విక్రయించింది. దీంతో ఈ కంపెనీ టాప్-5 లో నిలిచింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..