AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: శోభనం కోసం వరుడి ఆతృత.. సాకులు చెప్పుకొచ్చిన వధువు.. కట్ చేస్తే.. షాకింగ్ ట్విస్ట్.!

ఆ వ్యక్తికి 35 ఏళ్లు. ఎన్నో పెళ్లి సంబంధాలు చూసినా.. చివరి వరకు వచ్చి ఏదొక కారణంతో వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి..

Viral: శోభనం కోసం వరుడి ఆతృత.. సాకులు చెప్పుకొచ్చిన వధువు.. కట్ చేస్తే.. షాకింగ్ ట్విస్ట్.!
Viral
Ravi Kiran
|

Updated on: Jun 28, 2023 | 12:39 PM

Share

ఆ వ్యక్తికి 35 ఏళ్లు. ఎన్నో పెళ్లి సంబంధాలు చూసినా.. చివరి వరకు వచ్చి ఏదొక కారణంతో వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి ఓ పెళ్లిళ్ల పేరయ్య వద్దకు వెళ్లాడు. అతడు తీసుకొచ్చిన సంబంధం ఆ వ్యక్తికి నచ్చింది. అటు పెళ్ళికూతురు తరపు వాళ్లు కూడా ఒప్పుకున్నారు.. చివరికి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. శోభనం ముహూర్తం రానే వచ్చింది. ఎంతో ఆతృతగా ఎదురుచూశాడు. కట్ చేస్తే.. నవ వధువు ఏదొక సాకుతో ఫస్ట్ నైట్‌ను వాయిదా వేస్తూ వచ్చింది. చివరికి వరుడు బలవంతం పెట్టగా.. అసలు విషయం బయటపడింది. అంతే! ఆ వ్యక్తి జీవితం ఒక్కసారిగా తలక్రిందులైంది.

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన 35 ఏళ్ల చోటేలాల్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎంతకూ తనకు పెళ్లి కాకపోవడంతో.. చివరికి ఓ పెళ్ళిళ్ళ పేరయ్యను కలిశాడు. ఈ క్రమంలోనే ఒక సంబంధం కుదిరింది. సదరు పెళ్లికూతురు కుటుంబానికి నాలుగు లక్షలు ఇస్తానని చోటేలాల్ ఒప్పుకోవడంతో.. వారిద్దరి పెళ్లి కాస్తా అంగరంగ వైభవం జరిగింది. ఇక శోభనం ముహూర్తం రానే వచ్చింది. దాని కోసం చోటేలాల్ ఆతృతగా ఎదురుచూశాడు. కానీ వధువు మాత్రం ఎప్పుడూ ఏదొక సాకు చెప్పి.. శోభానాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. దీంతో విసిగిపోయిన చోటేలాల్ చివరికి ఫస్ట్ నైట్ జరగాలని బలవంతం చేయడంతో.. అసలు విషయం బయటపడింది. తనకు అంతకముందే పెళ్లి అయిందని ఆమె అసలు నిజాన్ని చెప్పింది. అంతే! దీంతో చోటేలాల్‌కు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. వరకట్నం కేసు పెడతానని వధువు బ్లాక్ మెయిల్ చేయడంతో చోటేలాల్ చేసేదేమిలేక చివరికి పోలీసులను ఆశ్రయించాడు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!