AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఫీల్డింగ్ జట్టుతోపాటు అంపైర్ ఘోర తప్పిదం.. ఔటైనా నాటౌట్‌గానే బ్యాటర్.. నవ్వులు పూయిస్తోన్న వీడియో..

Tamil Nadu Premier League: అనుకోకుండా చేసిన పొరపాటు వల్ల ఈ బ్యాట్స్‌మెన్ తన వికెట్‌ను కోల్పోయి ఉంటాడు. అయితే ఫీల్డింగ్ టీమ్ లేదా అంపైర్ దీనిని పట్టించుకోకపోవడం గమనార్హం. లైకా కోవై కింగ్స్ వర్సెస్ సేలం స్పార్టాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇది చోటుచేసుకుంది.

Video: ఫీల్డింగ్ జట్టుతోపాటు అంపైర్ ఘోర తప్పిదం.. ఔటైనా నాటౌట్‌గానే బ్యాటర్.. నవ్వులు పూయిస్తోన్న వీడియో..
Tnpl 2023 Viral Video
Venkata Chari
|

Updated on: Jun 28, 2023 | 12:27 PM

Share

TNPL 2023: క్రికెట్ మైదానంలో ఎన్నో తప్పిదాలు జరుగుతుంటాయి. అయితే వీటిని గమనించి, సక్రమంగా వినియోగించుకున్న జట్లు లాభపడ్డాయి. గనించలేని టీంలు భారీగా నష్టపోయాయి. తాజాగా, తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) లో మంగళవారం ఓ సంఘటన జరిగింది. బ్యాట్స్‌మెన్ నవ్వు తెప్పించే పని చేశాడు. అనుకోకుండా చేసిన పొరపాటు వల్ల ఈ బ్యాట్స్‌మెన్ తన వికెట్‌ను కోల్పోయి ఉంటాడు. అయితే ఫీల్డింగ్ టీమ్ లేదా అంపైర్ దీనిని పట్టించుకోకపోవడం గమనార్హం. లైకా కోవై కింగ్స్ వర్సెస్ సేలం స్పార్టాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇది చోటుచేసుకుంది.

ఈ మ్యాచ్‌లో కింగ్స్ బ్యాట్స్‌మెన్ సుజోయ్ రనౌట్ అయ్యాడు. అయితే, సేలం జట్టు దానిపై అప్పీల్ చేయలేదు. అంపైర్ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ 199 పరుగులు చేసింది. సేలం జట్టు 120 పరుగులకే ఆలౌటైంది.

ఇవి కూడా చదవండి

బ్యాట్స్‌మన్‌ను కాపాడిన అదృష్టం..

ఇది కింగ్స్ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో చోటుచేసుకుంది. అభిషేక్ తన్వర్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ సుజయ్‌కి బంతిని విసిరాడు. అతను దానిని కవర్స్ వైపు ఆడాడు. సాయి సుదర్శన్ ముందు ఉన్నాడు. ఇద్దరూ రన్ తీసుకోవాలనుకున్నారు. ఫీల్డర్ బంతిని పట్టుకుని, నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో విసిరాడు. బంతి బ్యాట్స్‌మెన్ సుజయ్‌ను తాకుతందని గమనించి, గాల్లోకి లేచి క్రీజులోకి దూకాడు. ఇంతలో బంతి అతని కాళ్ల మధ్య నుంచి వెళ్లి వికెట్లను తాకింది. బంతి వికెట్లను తాకినప్పుడు, బ్యాట్స్‌మన్ గాలిలో ఉన్నాడు.

View this post on Instagram

A post shared by FanCode (@fancode)

నిబంధనల ప్రకారం బ్యాట్స్‌మెన్ ఔటయ్యాడు. కానీ ఫీల్డింగ్ టీమ్ గానీ, అంపైర్ గానీ పట్టించుకోలేదు. ఫీల్డింగ్ టీమ్ అప్పీల్ చేస్తే, అంపైర్ మళ్లీ దానిపై దృష్టి పెట్టేవాడు. అవసరమైతే అతను థర్డ్ అంపైర్ సహాయం తీసుకునేవాడు. సేలం టీమ్‌కి వికెట్ లభించేది. కానీ, అది జరగలేదు. బ్యాట్స్‌మెన్‌లు పరుగులు తీస్తున్నప్పుడు బ్యాట్‌ను గ్రౌండ్‌లో ఉంచాలి. కానీ ఇక్కడ సుజయ్ అదే విషయాన్ని మరచిపోయాడు. దీంతో ఋ వీడియో తెగ వైరలవుతోంది.

కింగ్స్ విజయం..

కింగ్స్ తరపున రామ్ అరవింద్ 50, సుజయ్ 44, సుదర్శన్ 41 పరుగులు చేశారు. 22 బంతులు ఎదుర్కొన్న రామ్‌ తన ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు. సుజయ్ తన ఇన్నింగ్స్‌లో 32 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు బాదాడు. సుదర్శన్ 28 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో జట్టును పటిష్ట స్కోరు దిశగా తీసుకెళ్లాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..