ICC World Cup 2023: ‘సచిన్ కోసం 2011 ప్రపంచకప్ గెలిచాం.. ఆ దిగ్గజం కోసం 2023 ట్రోఫీ గెలవండి’
ICC World Cup 2023: వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ప్రకటన తర్వాత, వీరేంద్ర సెహ్వాగ్ టీమండియా మాజీ కెప్టెన్‌ను ప్రశంసిస్తూ ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.

ICC World Cup 2023: భారతదేశంలో అక్టోబర్ 5 నుంచి జరగనున్న వన్డే ప్రపంచ కప్ 2023 అధికారిక షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఇందుకోసం ముంబైలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ లాంచింగ్ ఈవెంట్‌లో భారత జట్టు మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా పాల్గొన్నాడు. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా మొత్తం టోర్నీని భారత్ సింగిల్‌గా నిర్వహించబోతోంది. షెడ్యూల్ ప్రకటన తర్వాత, వీరేంద్ర సెహ్వాగ్ విరాట్ కోహ్లీని ప్రశంసిస్తూ ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.
2011లో చివరిసారిగా భారత్ వన్డే ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వీరేంద్ర సెహ్వాగ్ కూడా టీమిండియాలో భాగమయ్యాడు. షెడ్యూల్ ప్రకటన తర్వాత సెహ్వాగ్ భారత ఆటగాళ్లకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. విరాట్ కోహ్లి కోసం గెలిపించాలని చెప్పాడు.
సచిన్ టెండూల్కర్ కోసం 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినట్లు సెహ్వాగ్ ప్రకటించాడు. ఇక ఇప్పుడు ఆటగాళ్లందరూ విరాట్ కోహ్లి కోసం ఈ ప్రపంచకప్‌ను గెలవాలని సూచించాడు. కోహ్లీ గొప్ప ఆటగాడు, మైదానంలో తన 100 శాతం అందించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాడు. ఇతర ఆటగాళ్లకు కూడా సహాయం చేస్తాడని ప్రశంసించాడు.




భారత్-పాక్ మధ్య మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నా..
ఈ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగే గొప్ప మ్యాచ్ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందన్న ప్రశ్నకు సెహ్వాగ్ స్పందిస్తూ.. ఒత్తిడి మ్యాచ్‌ల్లో భారత్ మెరుగ్గా ఆడుతుందని, అలాంటప్పుడు తమదే పైచేయిగా భావించవచ్చని అన్నాడు. 1990వ దశకంలో పాకిస్తాన్ ఇలాంటి మ్యాచ్‌లలో మెరుగ్గా రాణిచేంది. అయితే 2000ల నుంచి భారత్ మెరుగ్గా రాణిస్తూ, పాకిస్తాన్‌పై పైచేయి సాధిస్తోందని అన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




