Wasim Akram-WC 2023: ‘ఆ విషయంలో రాద్దాంతం వద్దు’.. పాక్ బోర్డ్‌కి మాజీ క్రికెటర్ చురకలు.. అసలు ఏమన్నాడంటే..?
ICC ODI World Cup 2023: భారత వేదికగా జరిగే ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ టీమ్ షెడ్యూల్ ప్రకారం కేటాయించిన స్టేడియాల్లోనే ఆడాలని, అనవసరపు రాద్దాంతం చేయకూడదని ఆ టీమ్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నాడు. ప్రపంచకప్ టోర్నీ షెడ్యూల్..
ICC ODI World Cup 2023: భారత వేదికగా జరిగే ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ టీమ్ షెడ్యూల్ ప్రకారం కేటాయించిన స్టేడియాల్లోనే ఆడాలని, అనవసరపు రాద్దాంతం చేయకూడదని ఆ టీమ్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నాడు. ప్రపంచకప్ టోర్నీ షెడ్యూల్ మంగళవారం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్ జట్టు అహ్మదాబాద్‌లో ఓ మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ ఆ మ్యాచ్‌ను నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడలేమని, దాన్ని వేరే మైదానంలో నిర్వహించాలని కోరింది. కానీ దాన్ని ఐసీసీ తొలిపుచ్చింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ మాట్లాడుతూ.. వేదిక విషయంలో ఎలాంటి సమస్య లేదని, పాక్ జట్టు షెడ్యూల్ ప్రకారమే ఆడాల్సి ఉంటుందన్నాడు.
‘ప్రపంచకప్‌లో పాక్ ఆడాల్సిన మ్యాచ్ వేదికలపై ఎలాంటి సమస్య లేదు. ఏయే స్టేడియాల్లో అయితే పాక్ ఆడాల్సి ఉందో అక్కడ ఆడుతుంది. చర్చలు ముగిశాయి. వేదికలపై మళ్లీ చర్చించడం అనేది అనవసరపు రాద్దాంతం అవుతుంది. తమ మ్యాచ్ ఆడాల్సిన స్టేడియాల గురించి పాక్ ఆటగాళ్లను అడితే.. వాళ్లు దాన్ని పట్టించుకోవడంలేదు. షెడ్యూల్ ప్రకారమే వాళ్లు ఆడతారు’ అని వసీమ్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే వసీమ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రదర్శిస్తున్న అహంకారంపై చురకలు వేశాడు. ‘మీకు అహం ఉంటే దాని తప్పేమిటో తెలుసుకోండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో కూడా ప్లాన్ చేసుకోండి’ అని వసీమ్ అన్నాడు.
Pakistan shouldn’t demand venues should play according to the schedule don’t create unnecessary problems: Wasim Akram #WasimAkram #CricketWorldCup #WorldCup2023 pic.twitter.com/e23uRkTTjA
— Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) June 27, 2023
పాకిస్థాన్ డిమాండ్ నెరవేరింది..
షెడ్యూల్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్‌తో పాక్ జట్టు చెన్నైలో.. అలాగే ఆస్ట్రేలియాతో బెంగళూరులో ఆడాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్ వేదికలను మార్చాలని పాకిస్థాన్ డిమాండ్ చేయగా.. అవి నెరవేరలేదు. కానీ ముంబైలో తమ మ్యాచ్‌లు ఏవీ ఆడబోమని, అక్కడ భద్రతా కారణాలు చాలా ఉన్నాయని పాక్ బోర్డ్ ముందుగానే తెలిపింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా పాక్ అభ్యర్థను మన్నించి, ముంబైలో ఎలాంటి మ్యాచ్‌లు లేకుండా షెడ్యూల్ చేసింది. ఇదిలా ఉండగా ఓ సెమీఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ జట్టు సెమీఫైనల్‌కు చేరితే, ఈ మ్యాచ్ కోల్‌కతాలో జరుగుతుంది.
The ICC Men’s @CricketWorldCup 2023 is almost here 🏆
Are you ready for it? 😍 pic.twitter.com/z8VlWfpGSo
— ICC (@ICC) June 28, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..