MS Dhoni, WC Final 2011: ‘ధోని నిర్ణయం వెనుక మిస్టరీ అదే’.. బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
World Cup Final 2011: భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోని ఓ సంచలనం. టీమిండియాకు 3 ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో సందర్భాల్లో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నాడు. ధోని తన నిర్ణయాలతో ఒక్కోసారి క్రికెట్..
ODI World Cup Final 2011: భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోని ఓ సంచలనం. టీమిండియాకు 3 ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో సందర్భాల్లో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నాడు. ధోని తన నిర్ణయాలతో ఒక్కోసారి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిస్తే.. మరోసారి షాక్‌కి గురిచేసేవాడు. ఏదిఏమైనా క్రికెట్ లవర్స్‌ని అలరించేవాడు. అయితే ధోని తీసుకున్న ఆ నిర్ణయాలు కొన్ని నేటికీ పెద్ద మిస్టరీలానే ఉన్నాయి. అసలు ధోని ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకున్నాడో అతనికి మాత్రమే తెలుసు. కానీ అలాంటి ఓ కీలక నిర్ణయం వెనుక ఉన్న రహస్యం తనకు తెలుసని శ్రీలంక స్పిన్ మాంత్రికుడు, దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరణ్ చెప్పుకొచ్చాడు. అంతేకాక ఆ రహస్యమేమిటో కూడా వివరించాడు.
భారత్ వేదికగా శ్రీలంకతో జరిగిన 2011 వరల్డ్‌కప్ ఫైనల్‌లో ధోని.. చేజింగ్ సమయంలో బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో పెద్ద మార్పునే చేశాడు. దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ రావాల్సిన 5 నెంబర్‌లో ధోని బ్యాటింగ్‌కి వచ్చాడు. ఆ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అసలు ధోని తీసుకున్న ఆ నిర్ణయానికి కారణం ఏమిటనేది నేటికీ ఓ మిస్టరీ. అయితే దానిపై మురళీధరణ్ మాట్లాడుతూ ‘ధోని అలా యూవీ కంటే ముందే బ్యాటింగ్‌కి రావడానికి నేనే కారణం. ఎందుకంటే నా బౌలింగ్‌లో యువరాజ్‌కి పెద్దగా రికార్డ్ లేదు, కానీ ధోనికి ఉంది. అంతేకాక ఐపీఎల్(చెన్నై సూపర్ కింగ్స్ తరఫున) నెట్స్‌లో కలిసి ప్రాక్టీస్ చేయడం వల్ల నా బంతులను ఆడిన అనుభవం కూడా ధోనికి బాగానే ఉంది. అందుకే ధోని బ్యాటింగ్ ఆర్డర్‌లో అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు’ అని అభిప్రాయపడ్డాడు. అయితే ఇది ఎంతవరకు నిజమో ధోని నోరు విప్పితేనే అందరికీ తెలుస్తుంది.
ధోని నిర్ణయమే భారత్‌ని విజేతగా నిలిపింది..
ప్రపంచకప్ 2011 ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేశారు. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 22వ ఓవర్ ముగిసేసరికి వీరేంద్ర సెహ్వాగ్(0), సచిన్ టెండూల్కర్(18), విరాట్ కోహ్లీ(35) వికెట్లను కోల్పోయింది. పైగా ఆ సమయంలో ముత్తయ మురళీధరణ్ వంటి దిగ్గజ స్పిన్నర్ బౌలింగ్ చేస్తున్నాడు. అంతే రంగంలోకి దిగిన ధోని.. గౌతమ్ గంభీర్(97)తో జత కలిశాడు. గంభీర్ పెవిలియన్ చేరగానే క్రీజులోకి వచ్చిన యువరాజ్(21)తో కలిసి భారత్‌ని ప్రపంచ విజేతగా నిలిపాడు ఎంఎస్‌డీ(91, నాటౌట్).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..