శివలీల గోపి తుల్వా |
Updated on: Jun 27, 2023 | 9:55 PM
ఏ జీవికైనా విశ్రాంతి చాలా అవసరం. అది నిద్రతోనే సాధ్యం. అందుకే గంటల తరబడి నిద్రపోతుంటాం మనం కూడా. మన చుట్టూ ఉండే గేదెలు, కుక్కలు కూడా అంతే. అయితే ఈ భూమి మీద కొన్ని జీవులు ఉన్నాయి. అవి క్షణం పాటు కూడా నిద్రపోవు.
అస్సలు నిద్రించని జీవుల లిస్టులో చీమలు ప్రముఖమైనవి. ఇవి ఒక్క క్షణం కూడా నిద్రించవు. ఎందుకంటే వాటి కళ్లపై రెప్పలు ఉండదు. అందుకే అవి విశ్రాంతి కోసం ఒక చోట ఆగుతాయి, లేదా నిత్యం అటు ఇటు తిరుగుతూ వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి.
జెల్లీ ఫిష్ తన జీవితకాలంలో ఎప్పుడూ నిద్రపోదని, విశ్రాంతి కోసం తన శరీరాన్ని నీటిలో వదులుతుందని 2017లో ఓ నివేదిక వచ్చింది. అలా విశ్రాంతి తీసుకునే సమయంలో అవి ఆలస్యంగా ప్రతిస్పందిస్తాయంట.
సీతాకోకచిలుకలు కూడా తమ జీవితకాలంలో ఎప్పుడూ నిద్రించవు. ఒకే చోట ఉండడం ద్వారా మాత్రమే విశ్రాంతి తీసుకుంటాయి. ఇక విశ్రాంతి సమయంలో సీతాకోకచిలుకల శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన తగ్గుతుంది.
సముద్రంలో నివసించే షార్క్ చేపలకు ఆక్సిజన్ చాలా అవసరం. అందుకోసం అవి నిరంతరం నీటిపై తేలియాడుతూ ఉంటాయి. అలా తేలుతున్న సమయంలో అవి విశ్రాంతి తీసుకున్నప్పటికీ నిద్రపోవు.