AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మప్రేమ అంటే ఇదే.. కొండచిలువ నుంచి పిల్లల్ని కాపాడి.. ప్రాణాలు పోగొట్టుకున్న బాతు.. వీడియో వైరల్..

తల్లి తన పిల్లలను రక్షించడానికి కవచంలా నిలుస్తుంది. కవచంలా మారే క్రమంలో తన ప్రాణం పోయినా.. పిల్లలు బాధ పడకూడదని భావిస్తుంది. అమ్మ మనసుకి మనుషులు, జంతువులు, పక్షులు అనే తేడా లేదు. అందరూ ఒకటే అని నిరూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఒక  బాతు తన పిల్లల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టింది. 

Viral Video: అమ్మప్రేమ అంటే ఇదే.. కొండచిలువ నుంచి పిల్లల్ని కాపాడి.. ప్రాణాలు పోగొట్టుకున్న బాతు.. వీడియో వైరల్..
Viral Video
Surya Kala
|

Updated on: Jun 27, 2023 | 10:34 AM

Share

సృష్టిలో అమ్మప్రేమకు వెల కట్టేవారు ఎవరూ లేరు. తన బిడ్డల కోసం తల్లి పడే తపన త్యాగం ఈ ప్రపంచంలో మరెవరూ చేయరు చేయలేరు. పిల్లల కోసం ఏం చేయడానికైనా.. తన శక్తికి మించి పోరాడేది తల్లి మాత్రమే.  తన పిల్లల కోసం తన జీవితాన్ని కూడా పణంగా పెడుతుంది. ఒక బిడ్డ ఆపదలో ఉంటే అప్పుడు తల్లి తన పిల్లలను రక్షించడానికి కవచంలా నిలుస్తుంది. కవచంలా మారే క్రమంలో తన ప్రాణం పోయినా.. పిల్లలు బాధ పడకూడదని భావిస్తుంది. అమ్మ మనసుకి మనుషులు, జంతువులు, పక్షులు అనే తేడా లేదు. అందరూ ఒకటే అని నిరూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఒక  బాతు తన పిల్లల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టింది.

బాతు తన పిల్లలతో కలిసి ఒక గొయ్యి వంటి ‘ఇంట్లో’ విశ్రాంతి తీసుకుంటుంది. అదే సమయంలో అక్కడికి ఒక పెద్ద కొండచిలువ చేరుకుని వాటిపై దాడి చేస్తుంది. అప్పుడు బాతు తన పిల్లలందరినీ హడావిడిగా గొయ్యి నుండి బయటకు పంపించేస్తుంది. దాదాపు అన్ని బాతుపిల్లల్ని కొండచిలువ లోపలి వచ్చే లోపు బయటకు  పంపించేసినా.. తాను మాత్రం సకాలంలో బయటకు రాలేకపోయింది. అప్పటికే కొండచిలువ ఆ గొయ్యిలోకి చేరుకుని బాతుని చుట్టేసింది. బాతు తన నుంచి తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా గట్టిగా చుట్టేసింది. దీంతో కొండచిలువ ఊపిరి ఆడకుండా చేయడంతో తల్లి బాతు మరణించింది.

ఇవి కూడా చదవండి

తల్లి ప్రేమ, కరుణను తెలియజేసే ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ వీడియో @TheBrutalNature పేరుతో ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 44 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 17 వేల మందికి పైగా వీక్షించగా వందలాది మంది   లైక్ చేశారు.

బాతు తన పిల్లల్ని రక్షించడానికి తనకి తాను బలి అయిందని కొందరు అంటే.. కన్నీళ్లు తెప్పించిన ఈ దృశ్యం మనసుకు హత్తుకునేలా ఉందని కొందరు అంటున్నారు. ఇది కదా అమ్మ ప్రేమ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..