AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏడుగురు పిల్లలతో స్కూటీపై ఓ వ్యక్తి ప్రయాణం..డ్రైవర్‌ని అరెస్ట్ చేయమని డిమాండ్

కొందరు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం మానడం లేదు. ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి ఏడుగురు పిల్లలతో స్కూటీపై ప్రయాణిస్తున్నాడు. ఈ వ్యక్తి తన జీవితంతో పాటు పిల్లల జీవితాలతో కూడా ఆడుకుంటున్నాడని చూసిన వారు అనుకుంటున్నారు. 

Viral Video: ఏడుగురు పిల్లలతో స్కూటీపై ఓ వ్యక్తి ప్రయాణం..డ్రైవర్‌ని అరెస్ట్ చేయమని డిమాండ్
Viral Video
Surya Kala
|

Updated on: Jun 26, 2023 | 12:23 PM

Share

దేశంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని చర్యలు చేపట్టినా కొంతమంది వాహన దారుల్లో మార్పు రావడం లేదు. ముఖ్యంగా ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసే సమయంలో చేసే విన్యాసాలు ఇతరులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే స్కూటీపై ఇద్దరు మాత్రమే కూర్చుని ప్రయాణం చేయవచ్చు. స్కూటీపై ఇద్దరు కంటే ఎక్కువ మంది కూర్చుంటే.. అప్పుడు అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అయినప్పటికీ కొందరు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం మానడం లేదు. ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి ఏడుగురు పిల్లలతో స్కూటీపై ప్రయాణిస్తున్నాడు. ఈ వ్యక్తి తన జీవితంతో పాటు పిల్లల జీవితాలతో కూడా ఆడుకుంటున్నాడని చూసిన వారు అనుకుంటున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు చిన్నారులు స్కూటీపై ఎక్కడికో వెళ్తున్నారు. చిన్నారులు కూర్చునే స్టైల్ చూసిన నెటిజన్లు షాక్ తింటున్నారు. స్కూటీ ఫుట్‌బోర్డ్‌పై ఇద్దరు పిల్లలు నిలబడి ఉండగా, ఇద్దరు వెనుక సీట్లో కూర్చున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు. మిగిలిన ముగ్గురిలో ఇద్దరు స్కూటీకి ఇరువైపులా నిల్చుని తమను తాము జాగ్రత్తగా నిల్చున్నారు. మరొక బాలుడు ఒక స్కూటీ వెనుక నిలబడి ప్రయాణిస్తున్నాడు. దీంతో స్కూటీపై  డ్రైవర్‌ మినహా మొత్తం ఏడుగురు చిన్నారులు  ప్రయాణిస్తున్నారు. ఈ వీడియో ముంబైకి చెందినది అని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

 పబ్లిక్‌కి కోపం తెప్పించిన వీడియో  ఈ అత్యంత షాకింగ్ ఇస్తున్న ఈ వీడియో @_aamchi_mumbai_ Instagram పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 56 వేల మందికి పైగా లైక్ చేశారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర బాధను వ్యక్తం చేస్తున్నారు. ఒకే స్కూటీపై అంత మంది పిల్లలను కూర్చోబెట్టడం ప్రమాదకరం. ప్రమాదం జరిగినా.. పడిపోయినా పిల్లలు తీవ్రంగా గాయపడవచ్చంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూటీ డ్రైవర్‌ను అరెస్ట్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

స్కూటీ డ్రైవర్‌ని అరెస్ట్ చేయమని డిమాండ్  ఒకరు కారు కొనడానికి డబ్బులు లేని వారు ఇంత మంది పిల్లలకు జన్మనివ్వకండి. మరోవైపు ఇంకొకరు ఇద్దరు పిల్లలు చాలు అని అనుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఈ వ్యక్తి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడని మరొకరు వ్యాఖ్యానించారు. మొత్తానికి ఎక్కువమంది స్కూటర్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Shravan Kumar (@shravankr7)

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,..