వీడేం మనిషండి బాబోయ్…!! బెడ్‌రూమ్ నిండా పాములు, మొసళ్లను పెంచుతూ..
వెంటనే ఈ విషయాన్ని అటవీ శాఖ సిబ్బందికి తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని సురక్షితంగా అడవిలోకి వదిలేశారు. గంజాయిని ఉత్పత్తి చేయడం, లైసెన్స్ లేకుండా ప్రమాదకరమైన జంతువును ఉంచుకోవడం, జంతు హింస నేరాలకు పాల్పడినందుకు బాసిల్డన్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

డ్రగ్స్ ఉన్నాయని వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఒక ఇంటిపై దాడి చేశారు. కానీ, అక్కడ వారికి కనిపించిన సీన్ చూసి వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అక్కడ వారికి డ్రగ్స్ ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. కానీ, ఆ ఇంటి బెడ్‌రూమ్ నిండా పాములు, మొసళ్లు కనిపించాయి. వాటితో పాటుగా కప్పలు, సాలెపురుగులు కూడా ఉండటం గమనించిన అధికారులు కంగుతిన్నారు. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇంగ్లాండ్‌లోని వెస్ట్‌క్లిఫ్-ఆన్-సీలోని ఒక ఇంట్లో డ్రగ్స్ ఉన్నట్టుగా అధికారులకు సమాచారం అందింది. దాంతో అధికారులు తనిఖీలకు దిగారు. కానీ, ఆ ఇంట్లో ఎలాంటి డ్రగ్స్ ఆచూకీ లభించలేదు. కానీ, ఆ ఇంటి బెడ్‌రూమ్‌లో నాలుగు అడుగుల పొడవున్న మొసలి కనిపించింది. దాంతో పాటుగా 16 బతికి ఉన్న పాములు, కప్పలు, సాలెపురుగులను గుర్తించారు అధికారులు. ఈ జంతువులన్నీ చాలా కృశించిపోయాయని పోలీసులు తెలిపారు. మంచం పక్కనే మొసలి చనిపోయి ఉందని చెప్పారు.
ఈ పాములలో కోబ్రాస్, మడగాస్కాన్ హాగ్నోస్ పాములు,కొండచిలువలు వంటి అనేక ప్రమాదకరమైన అడవి జంతువులు ఉండటం పోలీసులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని అటవీ శాఖ సిబ్బందికి తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని సురక్షితంగా అడవిలోకి వదిలేశారు. గంజాయిని ఉత్పత్తి చేయడం, లైసెన్స్ లేకుండా ప్రమాదకరమైన జంతువును ఉంచుకోవడం, జంతు హింస నేరాలకు పాల్పడినందుకు బాసిల్డన్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
<iframe width=”823″ height=”823″ src=”https://www.youtube.com/embed/kHVg9rgQyUo” title=”Crocodile and snakes found in Essex house by drugs raid police” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share” referrerpolicy=”strict-origin-when-cross-origin” allowfullscreen></iframe>
ఈ ప్రమాదకరమైన జంతువులు కలిగి ఉన్న ఆ వ్యక్తి గంజాయికి బానిసగా మారాడని, ఆ మత్తులోనే అతడు వాటిని తన పడకగదిలో ఉంచుకుని జీవిస్తున్నాడు. ఇన్ని ప్రమాదకరమైన జంతువులు ఉన్నప్పటికీ, అవి అతన్ని ఏమీ చేయలేదు. కానీ సరైన ఆహారం లేకపోవడం వల్ల దాదాపు ఆ జంతువులన్నీ అలసిపోయి చనిపోయే ప్రమాద స్థితిలోకి వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే, ఈ సంఘటన జరిగి చాలా కాలం అవుతుంది. కానీ, కారణం ఏదైనా కానీ వార్త మాత్రం మరోమారు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..