- Telugu News Photo Gallery Amazing Health Benefits Of Eating Jaggery And Chana Together In Telugu Lifestyle News
Jaggery With Chana : శనగలు, బెల్లం కలిపి తింటే శరీరంలో ఏం జరుగుతుందంటే..
శనగలు బెల్లం.. కలిపి తింటే ఏమౌతుందో తెలియకుండానే మనం తరచూ తింటూనే ఉంటాం.. కానీ, ఇలాంటి ఫుడ్ కాంబినేషన్‌లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వేయించిన శనగలు, బెల్లం కలిపి తినటం వల్ల శరీరానికి కావాల్సిన పోషక విలువ ఎన్ని ఉన్నాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ప్రతి ఇంట్లోనూ బెల్లం, శనగలు తప్పనిసరిగా ఉండే ఆహార పదార్థాలు. ఉదయాన్నే పరగడుపున ఈ బెల్లం, శనగలను కలిపి తింటే శరీరంలో జరిగే అద్భుతాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Mar 25, 2025 | 9:14 PM

బెల్లం, శనగలను కలిపినపుడు అది విటమిన్లు, ఖనిజాలతో నిండిన మంచి పౌష్టికాహారం అవుతుంది. వేయించిన శనగల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. బెల్లం యాంటీ యాక్సిడెంట్లతో నిండి ఉంటుంది. బెల్లంలో జింక్, సెలీనియంలు ఎక్కువగా ఉంటాయి. వేయించిన శనగలు విటమిన్ బి6, విటమిన్ సి, ఫోలేట్, నియాసిన్, థియామిన్, రిబోఫ్లేవిన్, మాంగనీస్, ఐరన్ ఇలా ఎన్నో విటమిన్స్ ఉంటాయి..

రక్తహీనత లేదా కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిని శనగలు, బెల్లం కలిపి తినాలని నిపుణులు చెబుతున్నారు. పప్పులో ఫైబర్ పుష్కలంగా ఉన్నప్పటికీ, ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రెండింటినీ కలిపి తినడం మంచిది. ఇది శరీరంలోని ప్రతి బలహీనతను తొలగిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది.

బెల్లం, వేయించిన శనగలు రెండూ జింక్‌తో నిండి ఉంటాయి, ఇది శరీరంలో 300 ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఈ రెండు కలిపి తింటే మంచిది. వారు పడుకునే ముందు రాత్రి కొంచెం వేపిన శనగలు, బెల్లంలను పాలతో కలిపి తీసుకోవాలి.

ఇది మీ ఊపిరితిత్తులను శుభ్రం చేయడానికి మరియు కాలుష్య సంబంధిత వ్యాధుల నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. బెల్లంలోని ఐరన్, శనగల్లోని ప్రోటీన్, రుతుస్రావం సమయంలో స్త్రీ రక్తం కోల్పోడానికి, తమను తాము తిరిగి శక్తివంతం చేసుకోవడానికి ఈ పోషకాలు రెండూ ముఖ్యమైనవి.

దీనిలో ఉన్న పొటాషియం వాళ్ళ స్ట్రోక్, గుండెపోటు వంటి కార్డియాక్ సిస్టమ్ కు సంబంధించిన సమస్యలు రాకుండా సాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఫుడ్ బెస్ట్ ఆప్షన్. బెల్లం,శనగలు కలిపి తినడం వల్ల మీ జీవక్రియను పెంచుతుంది. ఉబకాయంతో బాధపడేవారిలో బరువు తగ్గడానికి సాయపడుతుంది.





























