Viral Video: అంతరిక్ష కేంద్రంలో జపాన్ వ్యోమగామి బేస్‌బాల్ గేమ్… వీడియో షేర్ చేసిన ఎలాన్ మస్క్
అంతరిక్ష వార్తలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. ముఖ్యంగా ఇటీవల వ్యోమగాములు సునీత విలియమ్స్, బుల్ విల్మోర్ ఐఎస్‌ఎస్‌లో చిక్కుకున్నారనే వార్తలను ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా గమనించారు. వారం రోజుల ట్రిప్ కోసం వెళ్లిన వారు తొమ్మిది నెలలు అక్కడే చిక్కుబడిపోవడంతో ఆసక్తిగా మారింది. ఎలాగోలా వారు భూమి మీదకు చేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే వ్యోమగాములు ఎక్కడ ఉంటారు? ఏం తింటారు? ఎక్కడ నిద్రపోతారు? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి

అంతరిక్ష వార్తలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. ముఖ్యంగా ఇటీవల వ్యోమగాములు సునీత విలియమ్స్, బుల్ విల్మోర్ ఐఎస్‌ఎస్‌లో చిక్కుకున్నారనే వార్తలను ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా గమనించారు. వారం రోజుల ట్రిప్ కోసం వెళ్లిన వారు తొమ్మిది నెలలు అక్కడే చిక్కుబడిపోవడంతో ఆసక్తిగా మారింది. ఎలాగోలా వారు భూమి మీదకు చేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే వ్యోమగాములు ఎక్కడ ఉంటారు? ఏం తింటారు? ఎక్కడ నిద్రపోతారు? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి సెర్చ్ చేశారు. ఈ క్రమంలో జపాన్‌కు చెందిన వ్యోమగామికి సంబంధించిన అంతరిక్ష ఆట ఇప్పుడు వైరల్‌గా మారింది.
జపాన్‌కు చెందిన వ్యోమగామి కోయిచి వకట అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు బేస్‌బాల్ ఆడారు. ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి కోయిచి వకట ఐఎస్ఎస్‌లో ఉన్నప్పుడు జీరో గ్రావిటీని ఉపయోగించి బేస్ బాల్ ఆడారు. తానే బాల్ విసిరి మళ్లీ తానే షాట్ కొట్టిన వీడియోను కోయిచి షేర్ చేశారు. ‘ఇది బేస్‌బాల్ సీజన్. మేజర్ లీగ్ బేస్‌బాల్ సీజన్ జపాన్‌లో ప్రారంభమవుతోంది. ఎక్స్‌పెడిషన్ 68 సమయంలో ఐఎస్ఎస్‌లో బేస్‌బాల్ ఆడాను. జీరో గ్రావిటీలో ఈ ఆట ఆడేందుకు జట్టుతో పని లేదు’ అని ఆయన పోస్టుకి క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోను మస్క్ రీపోస్టు చేశారు.
దాదాపు రెండు దశాబ్దాల పాటు కోయిచి వకాటా వ్యోమగామిగా పని చేశారు. 2024లో జేఏఎక్స్ఏ నుంచి రిటైర్ అయ్యారు. ఐదుసార్లు ఐఎస్ఎస్‌కు వెళ్లిన కోయిచి మొత్తంగా 500 రోజులు అంతరిక్షంలో గడిపారు. ఎక్స్‌పెడిషన్ 39 సమయంలో ఐఎస్ఎస్‌లో తొలి జపనీస్ కమాండర్‌గా నిలిచారు. అంతరిక్ష కేంద్రంలో బేస్‌బాల్ ఆడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియో చూడండి:
— Elon Musk (@elonmusk) March 25, 2025