Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓరీ దేవుడో.. అమ్మాయి తలలో గూడుపెట్టుకున్న పాము..! తెల్లటి పిల్ల మెల్లగా..

సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన అనేక రకాల వీడియోలను మీరు చూసి ఉంటారు. పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతాయి. కొన్ని వీడియోలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అలాంటిదే పాము పిల్లకు సంబంధించి ఇటీవల ఒక ఆశ్చర్యకరమైన వీడియో వైరల్ అవుతోంది.

Viral Video: ఓరీ దేవుడో.. అమ్మాయి తలలో గూడుపెట్టుకున్న పాము..! తెల్లటి పిల్ల మెల్లగా..
Snake Baby
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 25, 2025 | 9:26 PM

పామును చూసిన ప్రతి ఒక్కరూ భయపడతారు. పాము పాకే విధానాన్ని చూస్తుంటేనే గుండె కొట్టుకోవడం కూడా మానేసేంత భయం వేస్తుంది కొందరికి. ఈ భూమిపై అత్యంత ప్రమాదకరమైన జీవులలో పాములు కూడా ఉన్నాయి. సరీసృపాలలో మొసళ్ళు, పాములు అత్యంత ప్రమాదకరమైనవిగా పరిగణించబడతాయి. ఈ భూమిపై అలాంటి పాములు కొన్ని మాత్రమే కనిపిస్తాయి. కొన్ని పాములు చాలా విషపూరితమైనవి, ప్రమాదకరమైనవి. అందుకే పాములకు దూరంగా ఉండటం ఎల్లప్పుడూ మంచిది.

సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన అనేక రకాల వీడియోలను మీరు చూసి ఉంటారు. పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతాయి. కొన్ని వీడియోలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అలాంటిదే పాము పిల్లకు సంబంధించి ఇటీవల ఒక ఆశ్చర్యకరమైన వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియోలో, ఒక అమ్మాయి జుట్టులో చిక్కుకున్న ప్రమాదకరమైన పాము పిల్ల కనిపించింది. పాము పిల్ల ఆ అమ్మాయి జుట్టులో ఎలా చిక్కుకుందో తెలియదు. ఈ వీడియోలో కనిపించే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..సాధారణంగా పాములకు ప్రతి ఒక్కరూ భయపడతారు. కానీ, ఈ అమ్మాయి మాత్రం ఆ పాము పిల్లకు ఏ మాత్రం భయపడటం లేదు. ఆ పాము తనను కాటేస్తుందని ఆ అమ్మాయి అస్సలు భయపడదు. పైగా ఆ అమ్మాయి తన జుట్టు నుండి పామును చాలా హాయిగా బయటకు లాగడం కనిపిస్తుంది. ఈ షాకింగ్ వీడియోను స్నేక్_యూనిటీ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 20,000 మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..