AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాకతీయ యూనివర్సిటీ హాస్టల్‌లో నాగుపాముల కలకలం.. ఎలుకల దాడులతో విద్యార్థుల హడల్!

Snakes In Kakatiya University: తెలంగాణలోని కాకతీయ యూనివర్సిటీ హాస్టల్స్‌లో పాములు, ఎలుకల బెడద విద్యార్థులను కలవరపెడుతోంది. పరిశుభ్రత లోపంతో హాస్టల్ గదుల్లోకి విషపురుగులు ప్రవేశిస్తున్నాయి. పాము కాట్లు, ఎలుక కాట్లకు గురైన ఘటనలు చోటుచేసుకున్నాయి. విద్యార్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వారి భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

కాకతీయ యూనివర్సిటీ హాస్టల్‌లో నాగుపాముల కలకలం.. ఎలుకల దాడులతో విద్యార్థుల హడల్!
Snakes In Kakatiya University
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Nov 02, 2026 | 1:27 PM

Share

తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ తరువాత అంతటి ప్రత్యేకత కలిగిన కాకతీయ విశ్వవిద్యాలయాన్ని విషపురుగులు వణుకు పుట్టిస్తున్నాయి. ఒకవైపు పాములు, తేళ్లు ఇంకోవైపు ఎలుకలు విద్యార్థులను హడలెత్తిస్తున్నాయి. కనీస శుభ్రత లేకపోవడంతో పాములు ఏకంగా హాస్టల్‌లోకే వస్తున్నాయి. ఎలుకలు హాస్టల్ గదిలోకి చొరబడి విద్యార్థులను రక్కీ గాయపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా హాస్టల్ గదులలో పాము కలకలం తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

నెలరోజుల క్రితం కాకతీయ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ గదిలో విద్యార్థినులను ఎలుకలు కరిచిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో 14 మంది పీజీ విద్యార్థులు ఎలుక కాటుకు గురయ్యారు. వారికి చికిత్స అందించి ఇంటికి పంపారు.

తాజాగా, కాకతీయ యూనివర్సిటీలోని ఫార్మసి హాస్టల్‌లో నాగుపాము ప్రత్యక్షం కావడంతో విద్యార్థుల్లో కలకలం రేపింది. హాస్టల్ పరిసరాల్లో తిరుగుతున్న పామును విద్యార్థులు గుర్తించారు. మెట్ల ద్వారా పైకి ఎక్కుతుండగా విద్యార్థులు గమనించి అధికారులకు సమాచారం అందించారు.

గర్ల్స్ హాస్టల్ గదిలో D బ్లాక్‌లో 15 రోజుల క్రితం మరో ఘటన జరిగింది. బాత్ రూమ్ డోర్‌లో పాము ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థినిలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వరుస ఘటనల నేపథ్యంలో కాలేజీ సిబ్బంది.. విద్యార్థులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయాల్లో అప్రమత్తంగా నడవాలని, హాస్టల్ పరిసరాల్లో చెత్త, ఆహారపు వ్యర్ధాలు లేకుండా శుభ్రం చేయాలని, పాము కనిపిస్తే వెంటనే సిబ్బందికి తెలియజేయాలని సూచించారు.

పాములు నేరుగా హాస్టల్ పరిసరాలలోకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎలుకలు ఏకంగా హాస్టల్ గదిలోకి చొరబడి విద్యార్థులను రక్కీ గాయపరుస్తున్నాయి. ఉన్నత విద్యను అభ్యసించడం కోసం వచ్చిన విద్యార్థులకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. పాముల బెడద నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

వీడియో చూడండి..

Follow Us
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు