AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raptadu Case Update: హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై బిగ్‌ అప్‌డేట్‌

రాప్తాడులో బాలికపై దాడికి పాల్పడిన ఘటనలో కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న హేమంత్‌ కుడికాలు పూర్తిగా తీసే ఛాన్స్ ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో అతని కాలు పూర్తి చిద్రమైపోయిందని తెలిపారు. ఇదిలా ఉండగా బాలికపై దాడి చేసినప్పుడు లేని బుద్ది నిందితుడికి ఇప్పుడు వచ్చింది.. ప్రాణం పోతుందన్న భయంతో తనని బతికించండి మహా ప్రభో అంటూ డాక్టర్లను వేడుకుంటున్నాడు నిందితుడు.

Raptadu Case Update: హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై బిగ్‌ అప్‌డేట్‌
Raptadu Case Update
Anand T
|

Updated on: Nov 02, 2026 | 1:43 PM

Share

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక నిందితుడిగా ఉన్న హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరపగా ప్రస్తుతం అతను హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే అతని ఆరోగ్యంపై కీలక అప్‌డేట్ ఇచ్చారు అధికారులు. పోలీసుల కాల్పుల్లో నిందితుడి మోకాలిచిప్పలు చిద్రమైపోయిందని.. మోకాలి నుంచి కుడికాలు పూర్తిగా తొలగించాల్సి ఉందని తెలిపారు. ఎడమకాలుకి అయిన గాయంపై మాత్రం ఇంకా పరీక్షలు అవసరమన్నారు.పూర్తి పరీక్షల తర్వాత ఆ కాలు విషయంలోనూ నిర్ణయం తీసుకుంటామన్నారు.

అయితే బాలికపై దాడికి పాల్పడిన అనంతరం అక్కడి నుంచి పారిపోయిన హేమంత్ అత్మకూర్ అటవీప్రాంతంలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు అతన్ని పట్టుకునేందుకు వెళ్లగా.. నిందితుడు హేమంత్ లొంగిపోకుండా పోలీసులపైనే దాడికి ప్రయత్నించాడు. కత్తితో పోలీసులపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హేమంత్ కాలిపై దాదాపు ఆరు బులెట్లు దిగాయి. దీంతో అతన్ని హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు.

ఇదిలా ఉండగా గాయం తనకి తగితే కానీ ఆ నొప్పి ఏంటో ఆ రాక్షసుడికి తెలిసి రాలేదు.. డాక్టర్ చికిత్స అందిస్తున్న సమయంలో బతికించండి అంటూ డాక్టర్లను వేడుకోవడం మొదలుపెట్టాడు. కానీ చట్టాన్నే నమ్మిన పోలీసులు కాల్పులు కాళ్లలో జరపడంతో బతికిపోయాడు హేమంత్. అదే శరీరం పై భాగంలో ఇంచుకో బుల్లెట్ చొప్పున దిగి ఉంటే బాగుండి కదా అంటున్నారు బాలిక బంధువులు, గ్రామస్తులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు