AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi – Aamani: చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే.. బాక్సాఫీస్ షేక్ చేసిన ఆ మూవీ చేసుంటే..

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. సినిమాల కంటే ఎక్కువగా సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణంలో జంబలకిడి పంబ నుండి మిస్టర్ పెళ్లాం వరకు ఐకానిక్ పాత్రలను గుర్తు చేసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్, బాపు వంటి దిగ్గజాలతో కలిసి పనిచేసిన అనుభవాలు, నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డుల విశేషాలు, అలాగే పరిశ్రమలో నటీమణుల మధ్య స్నేహం గురించి వివరించారు.

Chiranjeevi - Aamani: చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే.. బాక్సాఫీస్ షేక్ చేసిన ఆ మూవీ చేసుంటే..
Amani, Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Nov 02, 2026 | 1:47 PM

Share

టాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ ఆమని తన సుదీర్ఘ సినీ కెరీర్‌ను వెనక్కి తిరిగి చూసుకుంటూ అది గోల్డెన్ పీరియడ్ కాదని, ప్లాటినం పీరియడ్ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సినీరంగ ప్రవేశం సమయంలో మోడరన్ పాత్రలు, గ్లామర్ రోల్స్ చేయాలనుకున్న ఆమని ఊహించని విధంగా మిస్టర్ పెళ్లాం వంటి సినిమాలో మధ్య తరగతి గృహిణి పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆమని తన మొదటి చిత్రం జంబలకిడి పంబలో ఒక బబ్లీ, రౌడీ క్యారెక్టర్‌ను పోషించారు. అయితే బాపు గారి మిస్టర్ పెళ్లాం సినిమాతో ఆమెకు పూర్తి విరుద్ధమైన ఐడియల్ హౌస్ వైఫ్ ఇమేజ్ లభించిందని గుర్తు చేసుకున్నారు. ఈ అవకాశం రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారానే వచ్చిందని ఆమని వెల్లడించారు. రామారావు గారి బ్యానర్‌లో, బాపు గారి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి నలదమయంతి అనే పాటలో నటించే అదృష్టం తనకు లభించిందని, ఆ పాట తర్వాతే రాజేంద్ర ప్రసాద్ గారు మిస్టర్ పెళ్లాం సినిమా కోసం బాపు గారికి తన పేరును సిఫార్సు చేశారని ఆమె వివరించారు.

బాపు గారు, రాజేంద్ర ప్రసాద్ గారి వంటి దిగ్గజాలతో పనిచేయడం ద్వారా కెరీర్‌కు ఎంతో నేర్చుకున్నానని ఆమని తెలిపారు. ముఖ్యంగా సమయపాలన విషయంలో వారి నిబద్ధతను తెలిపారు. ఉదయం 7 గంటలకు కాల్ షీట్ ఉంటే బాపు గారు 6 గంటలకే సెట్‌లో ఉండేవారని, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అంతే అంకితభావంతో ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి గొప్ప నటులతో కలిసి పనిచేసినప్పుడు చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ను కూడా ఆయన తనకు నేర్పించారని అన్నారు. ఆమని తన కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడు పెళ్లి కారణంగా కొంత విరామం తీసుకోవాల్సి వచ్చిందని, దానివల్ల కొన్ని మంచి అవకాశాలను కోల్పోయానని విచారం వ్యక్తం చేశారు. కృష్ణారెడ్డి, ఆచంట గోపీనాథ్ వంటి వారు అప్పట్లోనే తనను తొందరపడొద్దని సలహా ఇచ్చినా, ఆ సమయంలో తన మనసుకు అది ఎక్కలేదని ఒప్పుకున్నారు. అయితే, ఇండస్ట్రీలో తనకు గోల్డెన్ లెగ్ అనే పేరు ఉందని, తాను నటించిన చిత్రాలలో చాలావరకు విజయవంతమయ్యాయని అన్నారు.

నటీమణుల మధ్య అప్పట్లో ఎలాంటి ఈగోలు ఉండేవి కావని, మంచి స్నేహపూర్వక వాతావరణం ఉండేదని ఆమని గుర్తు చేసుకున్నారు. రమ్యకృష్ణ గారు శుభలగ్నం చూసి తనను అభినందించారని, సౌందర్య గారు చేసిన అమ్మాయి పెళ్లాం సినిమా మొదట తనకే వచ్చిందని, అయితే సౌందర్య అద్భుతంగా నటించారని ఆమని అన్నారు. అలాగే చిరంజీవి చేసిన రిక్షావోడు చిత్రంలో మొదట తనకే ఛాన్స్ వచ్చిందని.. ఆ తర్వాత నగ్మా పేరు చూసి షాకయ్యానని అన్నారు. నిర్మాతలు మారడంతో సినిమా ఛాన్స్ మిస్సైందని తెలిపారు. అలాగే బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోలతో నటించినా, చిరంజీవి, వెంకటేష్ బాబు వంటి అగ్ర తారలతో పనిచేసే అవకాశం మిస్సయ్యానని ఆమని తెలిపారు. అలాగే కే విశ్వనాథ్, దాసరి నారాయణరావు, కే రాఘవేంద్రరావు వంటి లెజెండరీ దర్శకులతో పనిచేయగలిగానని ఆమని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

Follow Us
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు