Telangana: ఫుల్‌గా మద్యం తాగాడు.. తూగాడు.! వైన్ షాప్ క్లోజ్ చేస్తుండగా అతడ్ని చూసి..
అతడు మందు కొట్టేందుకు స్థానికంగా ఉన్న ఓ మద్యం దుకాణానికి వచ్చాడు. సాయంత్రం వరకు అక్కడే ఉండి ఫుల్ గా మద్యం తాగాడు. అయితే షాప్ యజమాని నైట్ వెళ్లిపోయేటప్పుడు చూసేసరికి.. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో క్రాంతి వైన్స్ వద్ద ఒక యువకుడు మద్యం సేవించి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రాలోని ఎన్టీఆర్ జిల్లా ఇనగడప గ్రామానికి చెందిన వేల్పుల గోపి(28) అనే యువకుడు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం లింగపాలెం గ్రామంలోని అత్తగారి ఇంటికి వచ్చి కూలీ పనులకు వెళ్తున్నాడు. అయితే నిన్న సాయంత్రం మర్లపాడులోని క్రాంతి వైన్ షాపు పరిధిలో ఉన్న సిట్టింగ్ ఏరియాలో కూర్చుని మద్యం సేవించాడు. షాపు మూసివేసే సమయానికి కూడా గోపి ఎలాంటి చలనం లేకుండా కూర్చున్న వద్దనే వాలిపోయి ఉన్నాడు. వైన్ షాపు నిర్వాహకులు 100కి డయల్ చేసి సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్‌లో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య సిబ్బంది పరిశీలించి అప్పటికే గోపి మృతి చెందినట్లు తెలిపారు. దీంతో గోపి మృతదేహాన్ని స్వగ్రామమైన ఇనగడపకు తరలించారు. లింగపాలెంకు చెందిన మృతుని బంధువులు గోపి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇది చదవండి: ‘నారా లోకేష్, ఆ హీరో, నేను క్లాస్‌మేట్స్.. కాలేజీ రోజుల్లో మేమంతా..’
ఈ నేపథ్యంలో గోపి మృతిపై ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసు అధికారులు విచారణ చేపట్టి దుకాణం వద్ద ఉన్న CC పుటేజీ వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ఎలా చనిపోయాడని పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అతిగా మద్యం సేవించడం కారణంగా చనిపోయాడా..? మద్యం మత్తులో గుండెపోటుకు గురైనాడా..? అనే కోణాల్లో పలు అనుమానాలను మృతుని బంధువులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి వైద్యులు ఇచ్చే రిపోర్టు ఆధారంగా కేసు నమోదు చెయ్యడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. వైన్ షాపు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సిట్టింగ్ రూమ్‌లో కొద్ది గంటల పాటు మృతుడు గోపి మద్యం తాగి కదలకుండా.. అలానే ఉండిపోయినప్పటికీ ఎవ్వరు పట్టించుకోకపోవడంపై మృతుని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా గుర్తించినట్టు అయితే సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకువెళ్లితే మృతుడు గోపి బ్రతికేవాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది చదవండి: ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ దర్శకుడు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




