Viral Video: పెళ్లి భరాత్‌లో కత్తులతో మహిళ విన్యాసాలు.. వైరల్ అవుతున్న వీడియో
పెళ్లి వేడుక తర్వాత భరాత్ నిర్వహించడం తెలంగాణలో సర్వసాధారణం. ఈ భరాత్‌లో డీజే పాటలు పెట్టి, నవ వధూవరులతో సరదాగా డ్యాన్సులు చేస్తారు బంధువులు. అయితే తాజాగా హైదరాబాద్‌లో సరదాగా జరగాల్సిన ఈ వేడుక వివాదాలకు దారి తీసింది. పెళ్లి భరాత్‌లో ఓ యువతి కత్తులు పట్టుకొని విన్యాసాలు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఒకప్పుడూ సాంప్రదాయంగా జరుపుకునే వివాహ వేడుకలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కొత్త ట్రెండ్ అంటు రకరకాలుగా వేడుకలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో గత కొంతకాలంగా పెళ్లి భరాత్‌లు హట్టహాసంగా నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఒక పెళ్లి భరాత్‌లో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. ఊరేగింపు సందర్భంగా ఓ మహిళ కత్తులు చేతబట్టుకుని రోడ్డుపైనే విన్యాసాలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
హైదరాబాద్ నగరం గోల్కొండ పరిధిలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఓ మహిళ చేసిన విన్యాసాలు పెద్ద చర్చకి దారితీశాయి. ఈ మధ్య హైదరాబాద్ నగరంలో పెళ్లి భరాత్‌ల్లో కత్తులతో విన్యాసాలు చేయడం ఆనవాయితీగా మారిపోయింది. వేడుకల్లో భాగంగా ఒకప్పుడు పదును లేని కత్తులతో విన్యాసాలు చేసేవాళ్లు.. కానీ, పోనుపోను ఆ సంస్కృతి హద్దులు దాటి నిజమైన కత్తులు ఉపయోగిస్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఘటనలో ఓ మహిళ తన సన్నిహితులతో కలిసి రెండు చేతుల్లో కత్తులు పట్టుకుని డాన్స్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఎలాంటి భయం లేకుండా అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఆ మహిళ కత్తులు పట్టుకుని విన్యాసాలు చేస్తుండడం స్థానికంగా కలకలం రేపింది.
నిజమైన కత్తులు పట్టుకొని విన్యాసాలు చేయడం చట్టపరంగా నేరం కావడంతో పలు ప్రాంతాలలో పోలీసులు కేసులు కూడా నమోదు చేసి జైలుకి పంపించారు. అయినప్పటికీ ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట పడడం లేదు. ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలను మానుకోవాలని పోలీసులు పలుమార్లు హెచ్చరించిన ఘటనలు కూడా ఉన్నాయి. హద్దులు దాటే విన్యాసాల వల్ల పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిని అదుపులోకి తీసుకుని హెచ్చరించాలని.. మరోమారు ఇలాంటివి జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
