AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: శివ పార్వతులు కనిపించారంటూ వ్యక్తి పూనకాలు.. కట్ చేస్తే.. ఆ ప్రాంతంలో.!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఓ వ్యక్తి వింతగా ప్రవర్తిస్తున్నాడు. తనకు శివపార్వతులు కనిపించారంటూ పూనకం వచ్చిన వాడిలా ప్రవర్తిస్తూ.. త్వరలో ఈ ప్రాంతం శైవ క్షేత్రంగా వర్ధిల్లుతుందని చెప్పాడు. నాలుగు నెలల కాలంలో ఇది రెండో ఘటన కాగా.. అటవీ భూముల ఆక్రమణ కోసం దేవుడు పేరుతో డ్రామాలు చేస్తున్నారంటున్నారు స్థానికులు. ఈ ఘటన భద్రాది కొత్తగూడెంలో చోటు చేసుకుంది. 

Telangana: శివ పార్వతులు కనిపించారంటూ వ్యక్తి పూనకాలు.. కట్ చేస్తే.. ఆ ప్రాంతంలో.!
Telangana
N Narayana Rao
| Edited By: TV9 Telugu|

Updated on: Feb 27, 2025 | 11:19 AM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుట్ట మల్లారంలో ఇటీవల ఏర్పాటు చేసిన శివశక్తి మహా పీఠం మరో శైవక్షేత్రంగా వర్దిల్లనుందని, తనకు శివ పార్వతులు కనిపించారంటూ ఓ వ్యక్తి చెప్తున్న మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. ఈ వ్యక్తి వింత ప్రవర్తన ఇప్పుడు మణుగూరులో చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. మణుగూరుకు తూర్పు దిక్కున ఉన్న రథం గుట్టం వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన శివశక్తి మహా పీఠం వద్ద శివ పార్వతులు తిరుగుతున్నారని, వారిని తాను చూశానని త్వరలో ఈ ప్రాంతం మరో శైవక్షేత్రం కాబోతుందంటూ ఆటో డ్రైవర్ సత్యనారాయణ చెప్తున్న మాటలు జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఇక్కడ అభివృద్ధి వేగంగా జరగనుందని, వచ్చే భక్తుల వద్ద ఎటువంటి డబ్బులు తీసుకోరాదని, ఈ గుడికి సంబంధించి ఏ అంశంలోనైనా ఇబ్బంది కలిగితే తనను సంప్రదించాలని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

గత కొంతకాలంగా మణుగూరు ప్రాంతంలో శివుడి పేరుతో పూనకాలు రావడం, తమకు శివయ్య కనిపిస్తున్నాడని చెప్పడం ఇది రెండో ఘటన. నాలుగు నెలల క్రితం ఇలాగే ఓ బాలుడు కమలాపురం ప్రాంతంలో భూమిలో శివలింగం ఉందంటూ తనను బయటకు తీయాలంటూ మూడు రోజులు హడావుడి చేసి ఊరు నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్లీ మరో వ్యక్తి వచ్చి తనకు శివపార్వతులు కనిపిస్తున్నారంటూ చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో బాలుడు.. ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్ సత్యనారాయణ.. చెప్తున్న ప్రదేశాలు అటవీ ప్రాంతానికి సంబంధించినవి కావడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అటవీ భూముల ఆక్రమణ కోసమే ఇలా కొందరు శివుడి పేరుతో డ్రామాలు ఆడుతున్నారంటూ స్థానికులు చెప్తుండడం విశేషం.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..