Telangana: కారు వదిలేసి డ్రైవర్ పరుగో పరుగు.. అనుమానమొచ్చి చెక్ చేయగా..
గంజాయి అక్రమంగా రాష్ట్రాల సరిహద్దులు దాటేస్తోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అక్రమార్కులు తమ క్రియేటివిటీకి పదునుపెట్టి మరీ.. అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా..
గంజాయి అక్రమంగా రాష్ట్రాల సరిహద్దులు దాటేస్తోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అక్రమార్కులు తమ క్రియేటివిటీకి పదునుపెట్టి మరీ.. అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కుసుమంచి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. చేగమ్మ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కార్లో 8 బస్తాల్లో 90 ప్యాకెట్ల ఎండు గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి పూణేకు గంజాయిని కారులో తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 90 లక్షల ఉంటుందన్నారు. గంజాయితో పాటు ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒరిస్సాలో తక్కువ రేటుకు గంజాయిని కొనుగోలు చేసి చిత్తూరు, ఖమ్మం మీదగా పూణే వెళ్లి అక్కడ ఎక్కువ ధరకు గంజాయిని విక్రయిస్తున్నట్టు నిందితులు అంగీకరించినట్లు ఖమ్మం రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డి తెలిపారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

