Viral Video: ల్యాండ్ అవుతుండగా.. రన్‌వేపై మరో విమానం.. పైలట్ ఏం చేశాడో చూస్తే అవాక్కవుతారు
అమెరికాలో భారీ విమాన ప్రమాదం తప్పింది. షికాగో ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీకొనేంత పరిస్థితి ఏర్పడింది. రన్‌వేపై ల్యాండ్ అవుతున్న ఫ్లైట్‌కు అడ్డంగా వచ్చింది మరో విమానం. అయితే ల్యాండ్ అవుతున్న విమానం పైలెట్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. ఆ వివరాలు
అమెరికాలో భారీ విమాన ప్రమాదం తప్పింది. షికాగో ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీకొనేంత పరిస్థితి ఏర్పడింది. రన్‌వేపై ల్యాండ్ అవుతున్న ఫ్లైట్‌కు అడ్డంగా వచ్చింది మరో విమానం. అయితే ల్యాండ్ అవుతున్న విమానం పైలెట్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. రెండు ఫ్లైట్లలో కలిపి వందకు పైగానే ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. షికాగోలో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం ఒమాహా నుంచి షికాగో మిడ్‌వే ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. రన్‌వే 31C మీద ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమైంది. సరిగ్గా అదే సమయానికి అదే రన్‌వేపై ఛాలెంజర్ 350 ప్రైవేటు జెట్ అడ్డంగా వచ్చింది. దీన్ని గమనించిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అప్పటికే ల్యాండింగ్ గేర్స్ ఓపెన్ అయ్యాయి. విమాన చక్రాలు దాదాపు నేలను తాకాయి. కాని ఎదురుగా అడ్డంగా వస్తున్న ప్రైవేట్ జెట్‌ను గమనించిన పైలట్లు.. వెంటనే విమానాన్ని పైకి లేపారు. పైలట్ల అప్రమత్తతతో ఈ రెండు విమానాలు ఢీకొనే ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తు చేపట్టింది. ఛాలెంజర్ 350 బిజినెస్ జెట్ ఎలాంటి అనుమతులు లేకుండానే ఒక్కసారిగా రన్‌వేపైకి వచ్చిందని ఎఫ్‌ఏఏ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

