Telangana: ఇది కదా విశ్వాసం అంటే.! పాముతో రెండు కుక్కల డేంజరస్ ఫైట్.. జరిగింది చూస్తే
విశ్వాసం అంటే ఇదే.. రెండు కుక్కలు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా.. ఓ పాముతో యుద్ధం చేశాయి. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. మరి అదేంటో.. ఆ స్టోరీ ఏంటో.? ఇప్పుడు ఇందులో తెలుసుకుందామా మరి.

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్ గ్రామానికి చెందిన దాసరి అంజయ్యకు రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి. ఇవి ఇంటి ఆవరణలో ఉంటాయి. లియో అనే పప్పీ డాగ్ అన్నీ తానై కాపలా ఉంటుంది. లియో ఆ ఇంటికి కాపలా ఉంటుంది. విష సర్పాలు వస్తే అరిచి వాటిని పంపించిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో పెద్ద నాగుపాము ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. పొడవాటి విష నాగుపాము ఇంట్లోకి వేగంగా చొరబడింది. అయితే ఇంటి ఆవరణలో ఉన్న రెండు కుక్కలు పాముపై దాడి చేసి చంపేశాయి.
ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసిన అడ్డుకుని దాడి చేశాయి. పాము బుసులు కొట్టిన ప్రతీసారి దాడి చేసి చంపి వేశాయి. మొదట కుందేలు బోన్‌లోకి వెళ్లేందుకు పాము ప్రయత్నం చేసింది. పామును గమనించి ఈ రెండు కుక్కలు దాడి చేసి చంపేశాయి. అయితే ఈ కుక్కలకు గాయాలు కావడంతో వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణ హాని లేదని డాక్టర్ చెప్పారు. పాము నుంచి కుక్కలు.. తమ కుటుంబాన్ని కాపాడయని యాజమాని అంజయ్య చెబుతున్నారు.
