AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయి.. మూడు ముళ్లతో ఒక్కటైన జంట..!

కులాలు వేరు.. ప్రాంతాలు వేరు.. దేశాలు వేరు.. అయినా మనసులు కలిశాయి. ఇంకేముందీ.. ఇద్దరు ఒక్కటయ్యారు. అమ్మాయి ఇక్కడి అబ్బాయికి హిందూ సంప్రదాయ ప్రకారం ఒక్కటయ్యారు. ఈ పెళ్లి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో అబ్బాయి ఇంటి వద్ద ఘనంగా ధూందాంగా వివాహ వేడుక జరిగింది.

ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయి.. మూడు ముళ్లతో ఒక్కటైన జంట..!
Siricilla District Love Marriage
G Sampath Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 02, 2025 | 11:54 AM

Share

సిరిసిల్ల అబ్బాయి, ఫ్రాన్స్‌ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన చైతన్య కొన్నేళ్లుగా ఫ్రాన్స్‌లో ఉంటున్నాడు. అక్కడ ఇమెన్ బెన్ నెజ్మ అనే యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరువురి కుటుంబాల పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం వైభవంగా జరిగింది. వివాహ వేడుకలో అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు హిందూ సంప్రదాయ దుస్తులు ధరించారు.

కులాలు వేరు.. ప్రాంతాలు వేరు.. దేశాలు వేరు.. అయినా మనసులు కలిశాయి. ఇంకేముందీ.. ఇద్దరు ఒక్కటయ్యారు. అమ్మాయి ఇక్కడి అబ్బాయికి హిందూ సంప్రదాయ ప్రకారం ఒక్కటయ్యారు. ఈ పెళ్లి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో అబ్బాయి ఇంటి వద్ద ఘనంగా ధూందాంగా వివాహ వేడుక జరిగింది. ప్రేమించుకున్న ఈ జంట పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ప్యారిస్ (ఫ్రాన్స్) కు చెందిన బెన్ నెజ్మ హసెన్- కొబ్రి వచ్చారు.

తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బుచ్చగారి రాజు గౌడ్-లక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు చైతన్యతో ప్యారిస్ ( ఫ్రాన్స్ ) కు చెందిన బెన్ నెజ్మ హసెన్- కొబ్రిల ప్రథమ పుత్రిక ఇమన్ బెన్ నెజ్మతో బంధుమిత్రులు, గ్రామస్తుల సమక్షంలో ఎంతో వైభవంగా పెళ్లి జరిగింది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బుచ్చగారి రాజు గౌడ్-లక్ష్మీల కుమారుడు చైతన్య ఉన్నత చదువుల కోసం ప్యారిస్ వెళ్లారు. అక్కడే ఉద్యోగం సంపాదించారు. ఈ క్రమంలోనే ప్యారిస్ కు చెందిన సాన్వి అలియాస్ ఇమేన్ బెన్ నెజ్మ అనే యువతితో ప్రేమలో పడ్డారు. ఇద్దరి మనసులు.. భావాలు కలిశాయి. ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాలు కూడా అంగీకారం తెలిపాయి.

దీంతో పెళ్లి వేడుక అబ్బాయి స్వగ్రామమైన ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో వరుడి ఇంటి వద్ద ఘనంగా జరిగింది. పెళ్లి హిందూ సంప్రదాయాల ప్రకారం చేశారు. కట్టుబొట్టు తెలుగు దనం ఉట్టిపడేలా ఫ్రాన్స్ అమ్మాయి అలకరించుకుంది. తెలుగు సైతం కొంచెం కొంచెం మాట్లాడుతున్న సాన్వి ఇక్కడి సంప్రదాయం బాగుందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు… ఈ పెళ్లి వేడుకకు గ్రామస్తులు హాజరై నూతన జంటను దీవించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..