Telangana: ప్రయాణికులకు భారీ షాక్.. మరోసారి ఛార్జీలు పెంచిన టీఎస్ ఆర్టీసీ.. నేటినుంచే అమల్లోకి..
ఆర్టీసీ బస్సుల్లో అదనపు డీజిల్ సెస్‌ను ఇవాళ్టి నుంచి వసూలు చేయనున్నారు. పల్లెవెలుగులో 250 కి.మీ. దూరానికి రూ.5 నుంచి రూ. 45 లకి పెంచారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 500 కి.మీ. దూరానికి రూ. 5 నుంచి రూ. 90 లకి..
ఓవైపు మార్కెట్లో నిత్యవసరాల ధరలు మండిపోతున్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు కూడా వరుసగా షాకిస్తున్నాయి. ఇటువంటి పరిస్థిలో ఇప్పటికే రెండుసార్లు ఛార్జీలు పెంచిన తెలంగాణ ఆర్టీసీ(TSRTC).. మరోసారి షాకింగ్ న్యూస్ అందించింది. తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. కిలోమీటర్ వారీగా డీజిల్ సెస్ విధించనున్నారు. డీజిల్ సెస్ పెంపుతో మరోసారి తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి.
కాగా, ఆర్టీసీ బస్సుల్లో అదనపు డీజిల్ సెస్‌ను ఇవాళ్టి నుంచి వసూలు చేయనున్నారు. పల్లెవెలుగులో 250 కి.మీ. దూరానికి రూ.5 నుంచి రూ. 45 లకి పెంచారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 500 కి.మీ. దూరానికి రూ. 5 నుంచి రూ. 90 లకి పెంచారు. ఇక డీలక్స్ బస్సుల్లో 500 కి.మీ. దూరానికి రూ. 5 నుంచి రూ. 125ల వరకు, సూపర్ లగ్జరీలో 500 కి.మీ. దూరానికి రూ. 10 నుంచి రూ. 130కి పెంచారు. ఏసీ బస్సుల్లో 500 కి.మీ. దూరానికి రూ. 10 నుంచి రూ. 170లకి పెంచారు. కాగా, హైదరాబాద్ పరిధిలో మాత్రం కొంత ఊరటనిచ్చింది. డీజిల్ సెస్ జీహెచ్‌ఎంసీ పరిధిలో లేదని టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.
ఏ బస్సులో ఎంత పెంచారో ఇప్పుడు చూద్దాం..
పల్లె వెలుగు.. 250 కి.మీ దూరానికి రూ. 5 నుంచి రూ.45 లకి పెంపు
ఎక్స్‌ప్రెస్.. 500 కి.మీ దూరానికి రూ. 5 నుంచి రూ. 90 లకు పెంపు
డీలక్స్.. 500 కి.మీ దూరానికి రూ. 5 నుంచి రూ. 125 లకు పెంపు
సూపర్ లగ్జరీ.. 500 కి.మీ దూరానికి రూ. 10 నుంచి రూ. 130 లకు పెంపు
ఏసీ సర్వీసులు.. 500 కి.మీ దూరానికి రూ. 10 నుంచి రూ. 170 లకు పెంపు