AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: కేంద్ర ఐటీ శాఖ మంత్రిని కలిసిన కేటీఆర్‌.. పలు కీలక అంశాలపై చర్చ..

KTR: హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి సహకరించాలని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కే తారకరామరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ను...

KTR: కేంద్ర ఐటీ శాఖ మంత్రిని కలిసిన కేటీఆర్‌.. పలు కీలక అంశాలపై చర్చ..
Narender Vaitla
|

Updated on: Jun 09, 2022 | 9:18 AM

Share

KTR: హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి సహకరించాలని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కే తారకరామరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ను కేటీఆర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌, రాజీవ్‌ల మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సమావేశానికి కేటీఆర్‌తో పాటు ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, కేఆర్‌ సురేశ్‌రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఐటీ అభివృద్ధికి అందిస్తున్న ప్రోత్సాహకాలను కేంద్ర మంత్రికి తెలిపారు. 2014 నుంచి ఇప్పటిదాకా జాతీయ ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని కేటీఆర్‌ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో తమ రెండో అతిపెద్ద క్యాంపస్‌లను నెలకొల్పాయని చెప్పుకొచ్చారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఐటీ రంగంలో కేవలం ఢిల్లీ, బెంగళూరు, పుణె వంటి నగరాలపైనే కాకుండా హైదరాబాద్‌పై కూడా దృష్టిసారించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు.

సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. కేంద్ర మంత్రి సమావేశానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ.. ‘భారత్‌లో ఎలక్ట్రానిక్స్‌ తయారీ పరిశ్రమ, నైపుణ్యాభివద్ధి అంశాలంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌తో సమావేశం జరిగింది. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణాన్ని రూపొందించడానికి తెలంగాణ ప్రయత్నిస్తోంది’ అంటూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?