Ramkrishna Mukkavilli: హైదరాబాద్ స్టార్టప్ వ్యవస్థాపకునికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు.. తొలి భారతీయుడిగా రికార్డు..

Ramkrishna Mukkavilli: గాలి నుంచి నీటిని తయారు చేయగల వ్యవస్థను నిర్మించడం ద్వారా నీటి కొరత సమస్యను అధిగమించడంలో సహాయపడే సాంకేతికతకు ఆయన మార్గదర్శకత్వం వహించారు.

Ramkrishna Mukkavilli: హైదరాబాద్ స్టార్టప్ వ్యవస్థాపకునికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు.. తొలి భారతీయుడిగా రికార్డు..
Ramkrishna Mukkavilli
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Jun 09, 2022 | 10:39 AM

Ramkrishna Mukkavilli: గాలి నుంచి నీటిని తయారు చేయగల వ్యవస్థను నిర్మించడం ద్వారా నీటి కొరత సమస్యను అధిగమించడంలో సహాయపడే సాంకేతికతకు ఆయన మార్గదర్శకత్వం వహించారు. వాతావరణ నీటి ఉత్పత్తి సాంకేతికతను ఉపయోగించి.. మైత్రి ఆక్వాటెక్ సంస్థ గాలి నుంచి 100 మిలియన్ లీటర్లకు పైగా మంచినీటిని ఉత్పత్తి చేసింది. ఇప్పుడు రామకృష్ణ ముక్కవిల్లి మరో ఘనత సాధించారు. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ వ్యవస్థాపకుడు ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కాంపాక్ట్ (UNGC) ద్వారా నీటి నిర్వహణ కోసం గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ (SDG) మార్గదర్శకుడిగా గుర్తింపు పొందిన మొదటి భారతీయుడిగా నిలిచారు. ఆయన గతంలో UN గ్లోబల్ కాంపాక్ట్ నెట్‌వర్క్ ఇండియా భారత SDG పయనీర్‌గా ఎంపికయ్యారు. ఇప్పుడు 2022 కోసం 10 కొత్త SDG పయనీర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.

భారత్ తో పాటు 27 దేశాల్లో ప్రకృతి ఆధారిత నీటి పరిష్కారాలతో నీటి భద్రతను నిర్మించడంలో ముక్కవిల్లి చేసిన కృషి ఆయనకు ఈ గుర్తింపు పొందడంలో సహాయపడింది. గాలి నుంచి నీటిని తయారు చేసే సాంకేతికత.. నీటి కొరత ఉన్న ప్రదేశాల్లో గృహ వినియోగదారుల అవసరాలు, అగ్ర ఫార్చ్యూన్- 500 కంపెనీలు, పెద్ద ప్రభుత్వ రంగ కంపెనీలు, ఆసుపత్రులు, పాఠశాలలు, సేవలందించే కమ్యూనిటీల అవసరాలను తీరుస్తుంది. ఇది 200 మిలియన్ లీటర్ల కీలకమైన భూగర్భ జల వనరులను రక్షించేందుకు దోహద పడిందని అంచనా.

“ఇలాంటి గుర్తింపులు ప్రస్తుత ప్రపంచ వాతావరణంలో మేఘదూత్ వంటి స్థిరమైన నీటి పరిష్కారాల ప్రాముఖ్యతను, ప్రపంచ నీటి సమస్య తీవ్రతను ఖచ్చితంగా చూపుతాయి. ఈ గుర్తింపు గ్రహం అంతటా నీటి సంక్షోభాన్ని తగ్గించడంలో నా ప్రయత్నాలను బలపరుస్తుంది. ఇతరులను కూడా అదే విధంగా చేయమని నేను కోరుతున్నాను” అని ముక్కవిల్లి అన్నారు.

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?