TSRTC: ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా..

దీంతో పట్టణాల్లో నివసించే తమ కూతుళ్ల కోసమో, కొడుకుల కోసమో గ్రామాల్లో పేరెంట్స్‌ పచ్చడిని తయారు చేసి సిటీలకు పంపిస్తుంటారు. వాళ్లు ఉన్న చోటుకు వెళ్లి మరీ ఇచ్చి వస్తుంటారు. ఇది కొంచం ఇబ్బందితో కూడుకున్న విషయం. అందుకే తెలంగాణ ఆర్టీసీ ఈ సమస్యకు ఒక చక్కటి పరిష్కారాన్ని చూపింది. అవకాయ పచ్చడిని ఆర్టీసీ బస్సుల్లో పంపించుకునేందుకు...

TSRTC: ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు  తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా..
TSRTC
Follow us

|

Updated on: Apr 20, 2024 | 2:31 PM

ఎండకాలం వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది సెలవులు అయితే ఆ తర్వాత గుర్తొచ్చేది ఆవకాయ. సమ్మర్‌లో లభించే మామిడి కాయలతో తయారు చేసే ఆవకాయ పచ్చడి ఏడాదంతా తాజాగా ఉంటుంది. కాగా పట్టణాల్లో నివసించే వాళ్లకంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారే ఎక్కువగా ఆవకాయ పచ్చడిని పెడుతుంటారు.

దీంతో పట్టణాల్లో నివసించే తమ కూతుళ్ల కోసమో, కొడుకుల కోసమో గ్రామాల్లో పేరెంట్స్‌ పచ్చడిని తయారు చేసి సిటీలకు పంపిస్తుంటారు. వాళ్లు ఉన్న చోటుకు వెళ్లి మరీ ఇచ్చి వస్తుంటారు. ఇది కొంచం ఇబ్బందితో కూడుకున్న విషయం. అందుకే తెలంగాణ ఆర్టీసీ ఈ సమస్యకు ఒక చక్కటి పరిష్కారాన్ని చూపింది. అవకాయ పచ్చడిని ఆర్టీసీ బస్సుల్లో పంపించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసింది. ఈ విషయమై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌ ట్వీట్ చేశారు.

సజ్జనర్‌ ట్వీట్ చేస్తూ.. ‘ఆవకాయ పచ్చడి ప్రియులకు శుభవార్త! రుచికరమైన అమ్మమ్మ చేతి ఆవకాయ పచ్చడిని మీ బంధువులు, స్నేహితులకు #TSRTC ద్వారా సులువుగా పంపించుకోవచ్చు. మీ సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా ఆవకాయ పచ్చడిని బంధుమిత్రులకు చేరేవేసే సదుపాయాన్ని సంస్థ కల్పిస్తోంది. తెలంగాణతో పాటు టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగే ఆంద్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లకు ఆవకాయ పచ్చడిని సంస్థ డెలివరీ చేస్తోంది’ అని రాసుకొచ్చారు. పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించాలని సజ్జనార్‌ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..