హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాల వివరాలివే..
హైదరాబాద్ ఎంఐఎం ఎంపి అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకు మునుపు పాతబస్తీ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. ముందుగా అసదుద్దీన్ ఓవైసీ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు అహ్మద్ బలాలా, మొహమ్మద్ ముబీన్, జుల్ఫీకర్ ఆలీ, జాఫర్ హుస్సేన్ మెరాజ్, మాజిద్ హుస్సేన్, కౌసర్ మొయినుద్దీన్, ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్, మాజీ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, యాసర్ అర్ఫాజ్లతో పాటు స్థానిక ఎంఐఎం కార్పొరేటర్లతో కలిసి చార్మినార్ మక్కా మసీదుకు చేరుకున్నారు.

హైదరాబాద్ ఎంఐఎం ఎంపి అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకు మునుపు పాతబస్తీ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. ముందుగా అసదుద్దీన్ ఓవైసీ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు అహ్మద్ బలాలా, మొహమ్మద్ ముబీన్, జుల్ఫీకర్ ఆలీ, జాఫర్ హుస్సేన్ మెరాజ్, మాజిద్ హుస్సేన్, కౌసర్ మొయినుద్దీన్, ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్, మాజీ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, యాసర్ అర్ఫాజ్లతో పాటు స్థానిక ఎంఐఎం కార్పొరేటర్లతో కలిసి చార్మినార్ మక్కా మసీదుకు చేరుకున్నారు. అక్కడ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మక్కామసీదు నుంచి చార్మినార్, గుల్జారాహౌజ్ల మీదుగా మదీనా నయాఫూల్ నుంచి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల నుంచి భారీగా మజ్లిస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి సామూహిక ర్యాలీలో పాల్గొన్నారు. దారిపొడవునా ఎంఐఎం శ్రేణులు మజ్లిస్ జెండాలు చేత పట్టుకుని పాల్గొన్నారు.
ఆస్తుల వివరాలు..
చరాస్తులు (నగదు, బంగారం, బీమా మొదలైనవి అసదుద్దీన్ ఓవైసీ పేరు మీద రూ.2.80 కోట్లు, జీవిత భాగస్వామి పేరు మీద రూ.15.71 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో పొందుపరిచారు. స్థిరాస్తులు (భూమి- వాణిజ్య & వ్యవసాయం) మార్కెట్ విలువ ప్రకారం అతని పేరు మీద రూ.16.01 కోట్లు ఉన్నాయని.. జీవిత భాగస్వామి పేరు మీద రూ. 4.90 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయుధాల విషయానికొస్తే.. ఒక NP బోర్ .22 పిస్టల్, మరో NP బోర్ 30-60 రైఫిల్ ఉన్నాయని అఫిడవిట్లో తెలిపారు. రూ.7 కోట్లు రుణాలు తీసుకున్నామని అసదుద్దీన్ ఓవైసీ ఈసీకి తెలిపారు. తాను 1994 లో లండన్లో బార్-అట్-లా, ఎల్ఎల్బి లింకన్స్ ఇన్ చదువుకున్నానని.. తనపై 5 పెండింగ్ కేసులు ఉన్నాయని వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..