TRS MLA poaching case: ఫామ్‌హౌస్ డీల్ వ్యవహారంలో సిట్ దూకుడు.. బీజేపీ నేత బీఎల్ సంతోష్‌పై కేసు..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. ఇప్పటికే.. దీనిపై టీఆర్ఎస్, బీజేపీ మాటల యుద్ధం కొనసాగుతోంది.
TRS MLA poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. ఇప్పటికే.. దీనిపై టీఆర్ఎస్, బీజేపీ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో సిట్ దర్యాప్తునకు సహకరించని కీలక సూత్రధారులపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. సిట్ దర్యాప్తు విచారణకు హాజరుకాని కీలక నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ మేరకు బీజేపీ నేత బీఎల్ సంతోష్‌పై సిట్ అధికారులు కేసు నమోదుచేశారు. ఫామ్‌హౌస్ డీల్ వ్యవహారంలో.. సంతోష్‌తో పాటు జగ్గుస్వామి, తుషార్‌పై కేసు నమోదు చేశారు. 26 లేదా 28న విచారణకు రావాలని సిట్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.
ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఏపీ నర్సాపూర్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సైతం సిట్ నోటీసులు జారీచేసింది. గతంలో ఫామ్‌హౌస్ కేసు నిందితులను కలిశారనే ఆరోపణలతో రఘురామకు 41ఏ నోటీసులు జారీ చేశారు.
కాగా, సిట్ విచారణకు బీజేపీ నేత బీఎల్ సంతోష్ గైర్హాజరుపై.. రెండురోజుల క్రితం హైకోర్టులో వాదనలు జరిగిన విషయం తెలిసిందే. మళ్లీ 41 సీఆర్ పీసీ నోటిసులివ్వాలని తెలంగాణ సిట్ అధికారులకు హైకోర్టు ఆదేశించింది. మళ్లీ వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా నోటీసులివ్వాలని హైకోర్టు తెలిపింది. బీఎల్ సంతోష్ సిట్ విచారణకు సహకరించాలని హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 30వతేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..