AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఫెయిలైన విద్యార్థులే వారి టార్గెట్‌.. నకిలీ సర్టిఫికెట్స్‌ ముఠా అరెస్ట్‌.. రెండేళ్లుగా..

డిగ్రీ సర్టిఫికేట్లు కావాలంటే చదువుకోవాల్సిన పనిలేదు. ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. డబ్బుంటే చాలు ఫేక్‌ డిగ్రీ సర్టిఫికేట్‌ చేతిలో పడుతుంది. హైదరాబాద్‌లో కొన్నేళ్లుగా సాగుతున్న ఫేక్‌ డిగ్రీ సర్టిఫికేట్ల దందా బయటపడింది.

Hyderabad: ఫెయిలైన విద్యార్థులే వారి టార్గెట్‌.. నకిలీ సర్టిఫికెట్స్‌ ముఠా అరెస్ట్‌.. రెండేళ్లుగా..
Hyderabad Crime News
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Nov 24, 2022 | 11:58 AM

Share

నకల్‌ కొట్టి పాస్‌ అయ్యే విద్యార్థులు ఇన్విజిలెటర్‌కు దొరికినట్టుగానే నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లను అమ్మేవారు పోలీసులకు అడ్డంగా దొరికారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నకిలీ సర్టిఫికెట్ల తయారీ, విక్రయ ముఠాను ఎల్‌బీ నగర్‌ జోన్‌లోని స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌, చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లు, ప్రింటర్లు, స్కానర్లు, రబ్బర్‌ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు ఆనంద్ కుమార్ తన ఫ్లెక్స్ షాపులో నకిలీ విద్యా సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను తయారు చేసి వాటిని ప్రింట్ చేసేవాడు. ఈ రాకెట్ లో మరో నిందితుడు హేమంత్ కుమార్ కూడా గత 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్  మలక్ పేటలో రికో కన్సల్టెన్సీ పేరుతో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని నడుపుతున్నాడు.

ఆనంద్ కుమార్ తో చేతులు కలపడంతో నకిలీ విద్యా సర్టిఫికెట్ల దందా జోరుగా సాగుతోంది. ఒక్కోక్కరి నుంచి వేల రూపాయలు తీసుకొని సర్టిఫికేట్లను ఇచ్చినట్టు తెలుస్తోంది. ముందుగా ఫెయిల్ అయిన విద్యార్థుల సమాచారాన్ని సేకరించేవారు. నిందితులందరూ కలిసి వీసా అభ్యర్థులకు నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాలను తయారు చేసి విక్రయించడంతోపాటు భారీ మొత్తంలో వసూలు చేయడం ప్రారంభించారు. వీసాల కోసం ప్రయత్నించే విద్యార్థులను టార్గెట్ చేసేవారని రాచకొండ పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో ఓ బాధిత విద్యార్థి ఫిర్యాదు చేయడంతో చైతన్యపురిలోని ఓ కన్సల్టెన్సీలో సోదాలు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ విద్యా సర్టిఫికేట్లు, ఇతర నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..