AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నీటి కోసం వెళ్లి శవమయ్యాడు.. డ్రమ్ములో పడి మూడేళ్ల బాలుడు మృతి..

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నీరున్న డ్రమ్ములో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన నాగర్ కర్నూల్ తెలకపల్లి మండలం కారువంగ గ్రామంలో జరిగింది.

Telangana: నీటి కోసం వెళ్లి శవమయ్యాడు.. డ్రమ్ములో పడి మూడేళ్ల బాలుడు మృతి..
Water Drum
Shaik Madar Saheb
|

Updated on: Mar 15, 2023 | 6:58 PM

Share

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నీరున్న డ్రమ్ములో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన నాగర్ కర్నూల్ తెలకపల్లి మండలం కారువంగ గ్రామంలో జరిగింది. నీటితో నిండిన డ్రమ్ములో పడి చిన్నారి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఎవరు లేని సమయంలో నిఖిల్(3) అనే బాలుడు బాత్రూంలోని నీటి డ్రమ్ము వద్దకు వెళ్లాడు. నీళ్లు ముంచుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో నీరు అందకపోవడంతో పక్కనే ఉన్న చిన్న బకెట్ ను బోర్లా వేసి ఆ బకెట్ పైకి ఎక్కి నీళ్లు తోడే ప్రయత్నం చేశాడు. నీరు తీసే క్రమంలో బకెట్ పైనుంచి జారీ.. డ్రమ్ములో పడ్డాడు. అనంతరం ఊపిరాడక డ్రమ్ములోనే తనువుచాలించాడు.

ఆ తర్వాత బాలుడు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. చుట్టుపక్కల ప్రాంతంలో వెతికినా ఫలితం లేకుండా పోయింది. చివరగా బాత్రూంలో చూడగా నీటి డ్రమ్ములో బాలుడు శవమై కనిపించాడు. కన్న కొడకును విగత జీవిగా చూసిన ఆ తల్లి గుండె పగిలేలా విలపించింది. ఈ సంఘటనతో కారువంగ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కాగా.. వేసవి కాలం కావడంతో చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉంటుంది. చాలా మంది డ్రమ్ముల్లో నీరు నింపుకుని ఉంచుకుంటారు. అలాంటి వారు.. ఇప్పటికైనా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?