Hyderabad: కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు పార్క్ చేస్తున్నారా? ట్రాఫిక్ పోలీసుల స్ట్రాంగ్ హెచ్చరిక! తేడా వస్తే..

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి.. హైదరాబాద్‌లో ఇదొక ఐకానిక్ స్పాట్. ఇక్కడ చాలామంది ఔత్సాహికులు తమ వాహనాన్ని ఆపి.. సెల్ఫీలు దిగుతుంటారు.

Hyderabad: కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు పార్క్ చేస్తున్నారా? ట్రాఫిక్ పోలీసుల స్ట్రాంగ్ హెచ్చరిక! తేడా వస్తే..
Hyderabad Cable Bridge
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 15, 2023 | 7:23 PM

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి.. హైదరాబాద్‌లో ఇదొక ఐకానిక్ స్పాట్. ఇక్కడ చాలామంది ఔత్సాహికులు తమ వాహనాన్ని ఆపి.. సెల్ఫీలు దిగుతుంటారు. అయితే అక్కడికి వెళ్లే ద్విచక్ర వాహనదారులకు, ఫోర్ వీలర్స్‌కు ముఖ్య అలెర్ట్. ఇకపై కేబుల్ బ్రిడ్జిపైన వాహనాలు ఆపితే.. భారీ జరిమానా తప్పదని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.

ఈ ఐకానిక్ స్పాట్‌లో ఫోటోలు దిగేందుకు ఎంతోమంది ఆసక్తిని కనబరుస్తారు. ఫోటోలు తీసుకునే ఆతృతలో చాలామంది బ్రిడ్జి అంచు వరకు వెళ్తున్నారు. తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలాగే బ్రిడ్జిపై వాహనాలను నిలిపేసి.. సమయాన్ని వృధా చేసేవారు కూడా ఉన్నారు. దీని వల్ల అటుగా వెళ్లే వాహనదారులకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇటీవల అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. బ్రిడ్జిపై వాహనాలు నిలపరాదని హెచ్చరించారు. అయితేనేం సందర్శకులు ఆ నిబంధనలను గాలికి వదిలేసి.. తమ వాహనాలను వంతెనపై అడ్డంగా నిలుపుతున్నారు.

దీంతో ఆ ప్రాంతంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నిబంధనలను ఉల్లంఘించి తమ వాహనాలను పార్క్ చేస్తున్నవారిపై రూ. 200 నుంచి రూ. 2000 వరకు జరిమానాను విధిస్తారు. అంతేకాదు.. పుట్టిన రోజు వేడుకలని లేదా స్నేహితులతో సరదాగా గడిపేందుకు వాహనాలను నిలిపేసినా.. అధిక మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. కాగా, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి.. బ్రిడ్జిపై తమ వాహనాలను ఆపి.. ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించకూడదని మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.