TSPSC Paper Leak Issue: ప్రవీణ్ మామూలోడు కాదు.. రేణుక కోసం మొదలుపెట్టి.. చాలామంది మహిళలతో..

టీఎస్పీఎస్సీ లీకుల్లో ఓవైపు సిట్‌ ముమ్మర దర్యాప్తు చేస్తోంటే.. మరోవైపు వివిధ సంఘాల ముట్టడితో పరిస్థితి రణరంగంలా మారింది. హ్యాకింగ్‌ నుంచి లీకింగ్‌ వరకు ప్రవీణ్‌, రాజశేఖర్‌ పక్కా స్ట్రాటజీని ఉపయోగించి.. దాన్ని రేణుకకు అందించినట్లు ప్రాథమికంగా తేల్చారు.

TSPSC Paper Leak Issue: ప్రవీణ్ మామూలోడు కాదు.. రేణుక కోసం మొదలుపెట్టి.. చాలామంది మహిళలతో..
Tspsc
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 15, 2023 | 8:29 PM

టీఎస్పీఎస్సీ లీకేజ్‌లో గందరగోళంగా తయారైంది పరిస్థితి. ఓవైపు విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు కమిషన్‌ కార్యాలయాన్ని ముట్టడించాయి. మరోవైపు సిట్‌ విచారణ వేగవంతం చేసింది. అయితే అభ్యర్థులు మాత్రం ఇంకా అయోమయంలోనే ఉన్నారు. లీక్‌ అయిన ఏఈ పరీక్షలను నిర్వహిస్తారా? తేదీ మారుస్తారా? టీఎస్పీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సిట్ నివేదిక తర్వాతే తేలనుంది. అయితే ఏబీవీపీ కార్యకర్తలు మాత్రం టీఎస్పీఎస్సీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేశారు. వారిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కి తరలించారు. ఇక వెస్ట్‌ జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలో ప్రభుత్వం సిట్‌ వేసింది. దీంతో రంగంలోకి దిగిన సిట్‌.. టీఎస్పీఎస్సీలో దర్యాప్తు చేసింది. కమిషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారుల నుంచి అన్నిరకాల వివరాలు సేకరించారు. కాన్ఫిడెన్షియల్‌ రూమ్‌లో పరిస్థితిని గమనించారు. హ్యాక్ అయిన కంప్యూటర్లు, వాటి ఐపీ అడ్రస్‌లు సేకరించారు. చైర్మన్‌, కార్యదర్శి కంప్యూటర్లనూ పరిశీలించారు సిట్‌ అధికారులు. పేషీల్లో పనిచేసే ఇతర సిబ్బందిని ప్రవీన్‌, రాజశేఖర్‌ కదలికల గురించి ఆరా తీశారు.

దాదాపు రెండున్నర గంటల పాటు టీఎస్పీఎస్సీలో సోదాలు నిర్వహించిన సిట్‌ అధికారులు కీలక విషయాలు రాబట్టారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ నుంచి యూజర్ ఐడీ, పాస్వర్డ్‌లను ప్రవీణ్‌ దొంగలించినట్లు గుర్తించారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్ సాయంతో పెన్ డ్రైవ్‌లో ప్రశ్నాపత్రాలు కాపీ చేసుకున్నాడు ప్రవీణ్‌. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న శంకర్ లక్ష్మి కంప్యూటర్ ను బాగు చేసే క్రమంలో రాజశేఖర్‌ ఐపీ అడ్రస్‌లు మార్చేశాడు. డైనమిక్ ఐపి అడ్రస్ కు బదులు స్టాటిక్ ఐపిని కంప్యూటర్‌కు అనుసంధానం చేశాడు రాజశేఖర్‌. దీంతో ఆ ఐపీ అడ్రస్‌తో సిస్టమ్‌ను హ్యాక్‌ చేసి.. ఏఈ సివిల్‌ పేపర్ ను కాపీ చేసుకున్నాడు ప్రవీణ్. ఇదంతా చేసింది రేణుక కోసమే అని తెలుస్తోంది. ఆ తర్వాత చాలా మందిని ట్రాప్ లో పడేసినట్లు సమాచారం. చాలా మంది మహిళలతో ప్రవీణ్ కాంటాక్ట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వారితో వీడియో కాల్స్ మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో ప్రవీణ్ రాసలీలలపై కూడా అధికారులు కన్నేశారు. సెల్ ఫోన్ డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.

సిట్‌ నివేదిక రాకపోవడంతో పరీక్షను రద్దుచేయాలా లేదా అనే విషయాన్ని తేల్చలేదు టీఎస్పీఎస్సీ. ఇప్పటికే పేపర్‌ లీక్‌ అయిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాని లిఖితపూర్వకంగా సిట్‌ నివేదిక ఇస్తే.. ఆతర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామంటోంది TSPSC. దీంతో 55వేల మంది అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..