Telangana: మామూలు సినిమా కాదిది.. ఈ కాయిన్ ఉంటే పొడిచినా ఏం కాదట! వీడియో చూస్తే కళ్లు తేలేస్తారు..

Suryapet News: రాగి నాణెం విలువ బయట మార్కెట్‌లో లక్షలు, కోట్లు ఉంటుందని నమ్మించి, మోసం చేసి డబ్బులు సంపాదించేవాడు. ఇటీవల రామరాజు మృతితో సౌజన్యకు నలుగురు పిల్లలను పోషించడం ఇబ్బందిగా మారింది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో గతంలో రామరాజుకు ఉన్న పాత పరిచయాలతో రాగి నాణెం అమ్మి డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలో మిర్యాలగూడకు చెందిన అజారుద్దీన్ సహాయంతో రాగి నాణెంను చూపించి సూర్యాపేటకు చెందిన ఒక వ్యక్తికి ఈ నాణెం మీ దగ్గర ఉంటే అద్భుతం జరుగుతుందని, కత్తితో పొడిచినా ఏమీ కాదని..

Telangana: మామూలు సినిమా కాదిది.. ఈ కాయిన్ ఉంటే పొడిచినా ఏం కాదట! వీడియో చూస్తే కళ్లు తేలేస్తారు..
Copper Coin
Follow us
M Revan Reddy

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 02, 2023 | 11:59 AM

సూర్యాపేట, ఆగష్టు 02: అగ్గిపుల్లా సబ్బుబిళ్ళా కాదేదీ కవితకు అనర్హం అన్న చందంగా పనికిరాని వస్తువులను కూడా ఎంతో మహిమగలవని, కోట్లు పలుకుతాయని నమ్మిస్తూ అమాయకులను బురిడీ కొట్టించి మోసం చేస్తున్నారు కేటుగాళ్ళు. అదేదో కొబ్బరి బోండాం సినిమాలో పురాతన రాగి నాణెం ఉంటే మనిషిలో నిద్రాణంగా దాగి ఉన్న శక్తులను తట్టిలేపుతుందనే సీన్ గుర్తుందా అచ్చం అలాంటి నాణమే మా దగ్గర ఉంది అని ఆ సీన్ ని తలదన్నేలాంటి ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌కు చెందిన రామరాజు, సౌజన్య ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రామరాజు తన వద్ద ఉన్న రాగి నాణెంకు విశిష్ట శక్తులు ఉన్నాయని, రాగి నాణెం విలువ బయట మార్కెట్‌లో లక్షలు, కోట్లు ఉంటుందని నమ్మించి, మోసం చేసి డబ్బులు సంపాదించేవాడు. ఇటీవల రామరాజు మృతితో సౌజన్యకు నలుగురు పిల్లలను పోషించడం ఇబ్బందిగా మారింది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో గతంలో రామరాజుకు ఉన్న పాత పరిచయాలతో రాగి నాణెం అమ్మి డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలో మిర్యాలగూడకు చెందిన అజారుద్దీన్ సహాయంతో రాగి నాణెంను చూపించి సూర్యాపేటకు చెందిన ఒక వ్యక్తికి ఈ నాణెం మీ దగ్గర ఉంటే అద్భుతం జరుగుతుందని, కత్తితో పొడిచినా ఏమీ కాదని.. బ్లేడ్ తో కోసినా రక్తం రాదంటూ మాయ మాటలు చెప్పారు.

నీలి రంగు నీళ్ళల్లో నాణెం వేస్తే తెల్లగా మారుతాయని బాధితుడికి మ్యాజిక్ చేసి చూపించి నమ్మించారు. దాంతో రాగి కాయిన్ కు రూ. 10 లక్షలకు బేరం మాట్లాడుకున్నారు. నిందితులకు రూ.6.50 లక్షలు చెల్లించి నాణెం తీసుకుని అనంతరం పరిశీలించారు. అయితే, వారు చూపిన దానికి విరుద్ధమైన ఫలితం వచ్చింది. దాంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు పట్టించాడు. ముందుగా మాట్లాడుకున్న ప్రకారం మొత్తం రూ. 10 లక్షల్లో ఇప్పుడు మరో రూ. 50 వేలు చెల్లిస్తామని నిందితులను నమ్మించాడు. తన వద్దకు రప్పించి, పోలీసులకు పట్టించాడు. దీంతో మహిమ కలిగిన రాగి నాణెంతో నిందితులు కటకటాల పాలయ్యారు. నిందితుల నుంచి రాగి నాణెం, సూది దారం, కత్తెర, రూ.50 వేల రూపాయల నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఆధునిక యుగంలో ఇలాంటివి నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ కంత్రీగాళ్ల ఎలా మాయ చేశారో కింది వీడియోలో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..