Hyderabad: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. హబ్సిగూడలోని ఓ షోరూంలో ఎగిసిపడిన మంటలు..
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ మంటల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలకు దట్టమైన పొగ వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి అత్యంత సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో చుట్టుపక్కల నివాసం ఉండేవారు ఆందోళన చెందుతున్నారు. ఉప్పల్ - సికింద్రాబాద్ ప్రధాన రహదారి పక్కనే ఈ అగ్ని ప్రమాదం జరగడంతో..
హైదరాబాద్ హబ్సిగూడలో అగ్నిప్రమాదం జరిగింది. అన్‌లిమిటెడ్ షోరూం నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్‌లోని 2, 3వ అంతస్తుల్లోని హబ్సిగూడ అన్ లిమిటెడ్ షోరూంలో మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ మంటల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలకు దట్టమైన పొగ వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి అత్యంత సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో చుట్టుపక్కల నివాసం ఉండేవారు ఆందోళన చెందుతున్నారు. ఉప్పల్ – సికింద్రాబాద్ ప్రధాన రహదారి పక్కనే ఈ అగ్ని ప్రమాదం జరగడంతో పూర్తి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిలావుంటే హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. అత్తాపూర్ హసన్ నగర్‌లో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ బట్టల గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. రెండు ఫ్లోర్లలో మంటలు వ్యాపించడంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. మంటలు ఎగిసిపడుతుండటంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. చుట్టుపక్కల ఇంళ్లకు మంటలు వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం