Telangana: పాపం కదరా! అమాయకులను వంచించి రూ. 80 లక్షలు కాజేసిన పోస్టల్ ఉద్యోగి..
Nalgonda News: ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొప్పోలులో ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ల కోసం 150 మంది ఆధారపడి ఉన్నారు. వీరంతా ఈ పెన్షన్ డబ్బులను స్థానిక సబ్ పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకుంటారు. కొప్పోలు సబ్ పోస్ట్ ఆఫీస్ లో (సబ్ పోస్ట్ మాస్టర్) ఎస్పీఎంగా గోవింద్ పనిచేస్తున్నాడు. ప్రతినెలా క్రమం తప్పకుండా గ్రామానికి చెందిన వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు ఆసరా పెన్షన్ పంపిణీ చేశాడు. ఇదే సమయంలో అమాయకుల ఆసరా పెన్షన్ లపై గోవిందు కన్నేశాడు.
Telangana: వారంతా బక్కచిక్కిన ప్రాణాలు.. ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్లపైనే ఆధారపడి బతుకుతున్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సబ్ పోస్ట్ మాస్టర్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. పొదుపు పేరుతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 80 లక్షల మేర పెన్షన్ దారుల డబ్బు స్వాహా చేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొప్పోలులో ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ల కోసం 150 మంది ఆధారపడి ఉన్నారు. వీరంతా ఈ పెన్షన్ డబ్బులను స్థానిక సబ్ పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకుంటారు. కొప్పోలు సబ్ పోస్ట్ ఆఫీస్ లో (సబ్ పోస్ట్ మాస్టర్) ఎస్పీఎంగా గోవింద్ పనిచేస్తున్నాడు. ప్రతినెలా క్రమం తప్పకుండా గ్రామానికి చెందిన వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు ఆసరా పెన్షన్ పంపిణీ చేశాడు. ఇదే సమయంలో అమాయకుల ఆసరా పెన్షన్ లపై గోవిందు కన్నేశాడు.
నిరక్షరాస్యులైన వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్ ఇవ్వాలంటే పొదుపు పథకంలో చేరాలని షరతులు పెట్టి డిపాజిట్లు చేయించాడు. డబ్బులు చెల్లించిన వాటికి రసీదులు కూడా ఇవ్వకుండా తన సొంత ఖాతాలో వేసుకున్నాడు. మాయ మాటలు చెప్పి ముందస్తుగా వేలిముద్రలు, సంతకాలు తీసుకుని మూడు నెలలుగా పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా రేపు మాపు అంటూ దాటవేశాడు. ఉన్నట్టుండి కొద్ది రోజుల నుంచి విధులకు హాజరు కావడం లేదు. వేరే ఉద్యోగి కొప్పోలుకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్నాడు.
తమకు ఇవ్వాల్సిన మూడు నెలలుగా ఆసరా పెన్షన్ డబ్బులు ఇవ్వాలంటూ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అడిగారు. ఆసరా పింఛన్లు క్రమం తప్పకుండా తీసుకున్నట్లు సంతకాలు చేసి ఉన్నాయని, డిపాజిట్ల పేరుతో వసూలు చేసిన డబ్బులు కూడా రిజిస్టర్‌లో ఎంట్రీ కాలేదని కొత్తగా వచ్చిన ఉద్యోగి చెప్పడంతో వీరంతా లబోదిమంటున్నారు. గ్రామంలోని 150 మంది పెన్షన్ దారులకు సంబంధించి 80 లక్షల రూపాయలకు పైగానే గోవింద్ స్వాహా చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. పిల్లలకు ఆరోగ్యం బాగాలేదని, 60 వేల రూపాయలు రావాలి ఇవ్వమని బ్రతిమాలినా ఇవ్వట్లేదని వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. పొదుపు డబ్బులు కాకుండా పెన్షన్ డబ్బులు ఇస్తానని మిషన్ పై వేలిముద్రలు వేయించుకొని డబ్బులు మాత్రం ఇవ్వలేదని వాపోతున్నారు. మెడిసిన్స్ తెచ్చుకోవడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని వృద్ధులు కోరుతున్నారు. సబ్ పోస్ట్ మాస్టర్ ఘరానా మోసానికి ఆసరా పెన్షన్ దారులు కన్నీరు మున్నీరవుతున్నారు. వీరంతా స్థానిక నేతల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెన్షన్ దారుల డబ్బుల స్వాహా పై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..