Khammam: యమధర్మరాజు కనికరించాడు! ట్రాక్టర్ మీద నుంచి వెళ్ళినా ప్రాణాలతో బయటపడ్డాడు.. షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్..
హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో ఓ వ్యక్తి పై నుంచి ట్రాక్టర్ వెళ్లినా ప్రాణాలతో బయటపడిన సంఘటన చోటుచేసుకుంది. అయితే, స్వల్ప గాయాలవగా.. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని పెద్దాపురం గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్‌లో డీజిల్ పోయించుకునేందుకు హెచ్‌పి పెట్రోల్ బంక్‌కు వచ్చాడు. అయితే, ట్రాక్టర్‌పై నిల్చుని తన లుంగీని సరి చేసుకునే సందర్భంలో.. లుంగీ తగిలి ట్రాక్టర్ గేర్ పడింది. దాంతో ట్రాక్టర్ ఒక్కసారిగా ముందుకు దూసుకు వెళ్ళింది. ఎదురుగా ఉన్న వ్యక్తి పై..
ఖమ్మం, ఆగష్టు 02: భూమి మీద నూకలుంటే.. ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడుతారని అంటారు. ఓ వ్యక్తి విషయంలో అదే జరిగింది. అది ఎంతటి అదృష్టం అంటే.. మీద నుంచి ట్రాక్టర్ వెళ్లినా చిన్నపాటి గాయాలతో బ్రతికి బయటపడ్డాడు. మృత్యుంజయుడిగా నిలిచాడు. ఉన్నట్లుండి.. ట్రాక్టర్ మీద నుంచి దూసుకెళ్లింది. అది చూసి ఆ వ్యక్తి చనిపోయారని అందరూ అనుకున్నారు. కానీ, అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో అతను సేఫ్ అయ్యాడు. ఇంతకీ ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అతనెలా బయటపడ్డాడో ఇప్పుడు చూద్దాం..
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలో హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో ఓ వ్యక్తి పై నుంచి ట్రాక్టర్ వెళ్లినా ప్రాణాలతో బయటపడిన సంఘటన చోటుచేసుకుంది. అయితే, స్వల్ప గాయాలవగా.. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని పెద్దాపురం గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్‌లో డీజిల్ పోయించుకునేందుకు హెచ్‌పి పెట్రోల్ బంక్‌కు వచ్చాడు. అయితే, ట్రాక్టర్‌పై నిల్చుని తన లుంగీని సరి చేసుకునే సందర్భంలో.. లుంగీ తగిలి ట్రాక్టర్ గేర్ పడింది. దాంతో ట్రాక్టర్ ఒక్కసారిగా ముందుకు దూసుకు వెళ్ళింది. ఎదురుగా ఉన్న వ్యక్తి పై నుండి వెళ్ళింది. వెంటనే గమనించిన బంకు సిబ్బంది ట్రాక్టర్ ను వెంబడించి బ్రేకులు వేశారు. చౌకు లాగి ఆపేశారు. తద్వరా మరో ప్రమాదం జరగకుండా నిలువరించారు.
క్షతగాత్రున్ని 108 ద్వారా హాస్పటల్ కు తరలించారు. చనిపోయాడనుకున్న బాధిత వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే, ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇదేదో సినిమా సీన్ లా అంతా మాయలా ఉందని, షాక్ నుంచి తేరుకొని బ్రతికి బయటపడ్డానని బాధిత అనుకున్నాడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను కింద వీడియోలో చూడొచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..