Telangana: ఆ ఎమ్మెల్యే సీటుకు ఎసరు! సంచలనం సృష్టిస్తున్న ఆడియో సంభాషణ..

ఇందుకు సంబంధించిన ఆడియో ఇప్పుడు జనగామ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ఆయన సొంత కూతురే తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్టు రావడం కష్టమే అనే ప్రచారం సాగుతుంది. ఈ పంచాయితీ ఇలా ఉండగానే.. మరోవైపు ముత్తిరెడ్డికి టికెట్ దక్కకుండా చేసేందుకు సొంత పార్టీకి చెందిన నాయకులే మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూ కుట్రలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఊతమిస్తూ తాజాగా ఓ ఆడియో రికార్డ్ వైరల్..

Telangana: ఆ ఎమ్మెల్యే సీటుకు ఎసరు! సంచలనం సృష్టిస్తున్న ఆడియో సంభాషణ..
BRS MLA Seat
Follow us
G Peddeesh Kumar

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 02, 2023 | 1:15 PM

జనగామ, ఆగష్టు 02: అధికార పార్టీ ఎమ్మెల్యేల సీటుకు ఎసరు పెట్టే కుట్రలు మొదలయ్యాయి. సొంత పార్టీకి చెందిన ఓ జిల్లా అధ్యక్షుడే.. ఎమ్మెల్యే కుర్చీకి ఎసరు పెట్టేందుకు కుట్ర చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఆడియో ఇప్పుడు జనగామ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ఆయన సొంత కూతురే తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్టు రావడం కష్టమే అనే ప్రచారం సాగుతుంది. ఈ పంచాయితీ ఇలా ఉండగానే.. మరోవైపు ముత్తిరెడ్డికి టికెట్ దక్కకుండా చేసేందుకు సొంత పార్టీకి చెందిన నాయకులే మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూ కుట్రలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఊతమిస్తూ తాజాగా ఓ ఆడియో రికార్డ్ వైరల్ అవుతోంది.

మొన్నటివరకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇక్కడి నుండి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. నియోజకవర్గంలో ఆయన వర్గీయులు హడావుడి చేశారు. దాంతో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పార్టీ అధినేతకు పిర్యాదు చేయడంతో ఆయన చల్లబడ్డారు. ఇక ముత్తిరెడ్డికి ముప్పు తప్పినట్లే అని ప్రచారం జరుగుతున్న తరుణంలో తాజాగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇక్కడ నుండి బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఆ ప్రయత్నాల్లో సాక్షాత్తు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రయత్నాలుు చేయడం ఇప్పుడు జిల్లాలో ఆసక్తికర చర్చగా మారింది. నర్మెట్ట జడ్పిటిసి సభ్యుడు శ్రీనివాస్‌తో జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి చేసిన సంభాషణ ఇప్పుడు జిల్లాల హాట్ టాపిక్ గా మారింది. పోచంపల్లి శ్రీనివాస రెడ్డికి ఇస్తే ఓకే.. లేదంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోసం అధినేతకు రెఫరెండం జారీ చేయాలని ఫోన్‌లో డిస్కస్ చేశారు. నలుగురు జెడ్పీటీసీలకు సీఎం కేసీఆర్ ఆపాయింట్ మెంట్ కూడా తామే ఇప్పిస్తామని అందులో డిస్కస్ చేశారు. జెడ్పీ చైర్మన్, జిల్లా అధ్యక్షుడే ఇలాంటి వ్యవహారాలు నడపడం పార్టీ శ్రేణుల్లో కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదంతా ఆయన ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నారా? లేక ఎవరైనా నడిపిస్తున్నారా? అనే చర్చ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఒకవైపు కూతురు తిరుగుబాటు నేపథ్యంలో ఇంటిపోరుతో తలపట్లు పట్టుకుంటున్న ముత్తిరెడ్డి కి.. ఇప్పుడు సొంతపార్టీ నేతలు ఆయన సీటుకు ఎసరు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు కంట్లో నలుసులా మారాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనగామ జిల్లాలో రగిలిన ఈ వివాదం ఎటు దారి తీస్తుందో అనే చర్చ జరుగుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..