Land registrations : తెలంగాణ లాక్ డౌన్ నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలకు తాత్కాలిక బ్రేక్
Telangana Land registrations : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనల వలన భూముల రిజిస్ట్రేషన్లకు తాత్కాలిక బ్రేక్ పడింది...
Telangana Land registrations : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనల వలన భూముల రిజిస్ట్రేషన్లకు తాత్కాలిక బ్రేక్ పడింది. వివిధ మండల కార్యాలయాలలో జాయింట్ సబ్ రిజిస్టార్ లుగా వ్యవహరిస్తున్న తహసిల్ దార్ల వద్ద ధరణీ ద్వారా నిర్వహించే భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలు ఈ నెల 12 05 2021 నుండి 21 05 2021 తేది వరకు జరుగవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి/ సి.సి.ఎల్.ఎ సోమేశ్ కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. అయితే ఈ నెల 12.05.2021 నుండి 21.05.2021 తేదీలలో రిజిస్ట్రేషన్ లకు ధరణీ ద్వారా స్లాట్ లు బుక్ చేసుకున్న వారి స్లాట్ లను రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలిపారు. స్లాట్ ల బుకింగ్ కై చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర చార్జీలు చెల్లుబాటు అవుతాయని, రీషెడ్యూల్ సమయంలో వాటిని జమ చేయనున్నట్లు చెప్పారు. లాక్ డౌన్ నిబంధనల మినహాయింపు కార్యక్రమాలలో ధరణీ లావాదేవీలు లేవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ధరణీ ద్వారా రిజిస్ట్రేషన్లకు కొనుగోలుదారు, అమ్మకం దారు తో పాటు ఇద్దరు సాక్షులు కలిపి మొత్తం నలుగురు వ్యక్తులు హాజరు కావాల్సివుంటుందని పేర్కొన్నారు.
Read also : How Mumbai tackled the rising curve : ముంబయిలో కరోనా తగ్గుముఖం, ఏమిటీ.. అసలు కారణం.. ?