AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Recovery: తెలంగాణ గాంధీ ఆస్పత్రిలో అద్భుతం.. కరోనాను జయించిన 110 ఏళ్ల వృద్ధుడు..

110 year old man: తెలంగాణలోని గాంధీ ఆస్పత్రిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. దేశంలోనే అత్యధిక వయస్సు(110) కలిగిన వ్యక్తి కరోనా ..

Corona Recovery: తెలంగాణ గాంధీ ఆస్పత్రిలో అద్భుతం.. కరోనాను జయించిన 110 ఏళ్ల వృద్ధుడు..
Shiva Prajapati
|

Updated on: May 12, 2021 | 9:58 PM

Share

110 year old man: తెలంగాణలోని గాంధీ ఆస్పత్రిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. దేశంలోనే అత్యధిక వయస్సు(110) కలిగిన వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాడు. అయితే అతన్ని మరికొన్ని రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని వైద్యాధికారులు తెలిపారు. పూర్తి వివరాల్లోకెళితే.. రామానంద తీర్థ(110) కీసరలోని ఓ ఆశ్రమంలో ఉంటున్నాడు. తాజాగా స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఆయనకు ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించగా.. తాజాగా కోవిడ్ నెగెటీవ్ అని నిర్ధారణ అయ్యింది. రామానంద తీర్థులు కి ఎలాంటి ఇతర జబ్బులు లేకపోవడం వల్లే ఇది సాధ్యమైందని, ప్రస్తుతం ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజా రావు వెల్లడించారు. అయితే మరికొన్ని రోజులు పరిశీలనలో ఉంచుతామని తెలిపారు.

కీసరలోని ఓ ఆశ్రమంలో నివసిస్తున్న రామానంద తీర్థులు.. స్వల్ప కోవిడ్ లక్షణాలతో ఏప్రిల్ 24వ తేదీన గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఆ సమయంలో రామానంద తీర్థులు ఆక్సీజన్ లెవెల్స్ 92 పాయింట్స్ గా ఉంది. ఇప్పుడు ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. ఆయనను సాధారణ వార్డుకు మారుస్తామని, పూర్తి స్థాయిలో కోలుకునే వరకు ఆయనకు ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తామని చెప్పారు.

ఇదిలాఉంటే.. ఇంత ఎక్కువ వయసు కలిగిన వ్యక్తి కరోనా నుంచి కోలుకోవడంతో దేశంలోనే తొలిసారి అని, అది కూడా తెలంగాణలోని గాంధీ ఆస్పత్రిలోనే రికార్డ్ అయ్యిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రకటించారు.

Also read:

Actor Poonam Kaur : బురదలో విరిసిన అందాల కమలం ఈ వయ్యారి.. వైరల్ అవుతున్న పూనమ్ ఫొటోస్..

Savings: మీకు స్థిరమైన ఆదాయం ఉండి..ప్రణాళికా బద్ధమైన పొదుపు గురించి ఆలోచిస్తే. నిపుణులు చెబుతున్న 50-30-20 విధానం ట్రై చేయండి!