Telangana Corona Cases: తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా వ్యాప్తి.. క్రమంగా తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు..

Telangana Corona Cases Updates: తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దాంతో రోజూ వారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల..

Telangana Corona Cases: తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా వ్యాప్తి.. క్రమంగా తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు..

Telangana Corona Cases Updates: తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దాంతో రోజూ వారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 69,525 శాంపిల్స్ పరీక్షించగా.. వీరిలో 4,723 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇదే సమయంలో రికవరీలు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులో రాష్ట్ర వ్యాప్తంగా 5,695 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా ప్రభావంతో రాష్ట్రంలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 59,133 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,11,711 మంది కరోనా బారిన పడగా.. వీరిలో 4,49,744 మంది కోలుకున్నారు. ఇక కరోనా ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,834 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.55 శాతం ఉండగా.. రికవరీ రేటు 87.89 శాతంగా ఉంది.

ఇక తెలంగాణ వ్యాప్తంగా తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 745 పాజిటివ్ కేసులు నమోదు అవగా.. మిగతా జిల్లాల్లోనూ అంతే స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్‌లో 44 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం – 105, జగిత్యాల – 134, జనగాం – 68, జయశంకర్ భూపాలపల్లి – 92, గద్వాల్ – 79, కామారెడ్డి -49, కరీంనగర్ – 219, ఖమ్మం – 205, కొమురంభీం ఆసిఫాబాద్ – 58, మహబూబ్‌నగర్ – 156, మహబూబాబాద్ – 161, మెదక్ – 55, మేడ్చల్ మల్కాజిగిరి – 305, ములుగు – 57, నాగర్‌ కర్నూల్ – 194, నల్లగొండ – 181, నిర్మల్ – 27, నిజామాబాద్ – 96, పెద్దపల్లి – 148, రాజన్న సిరిసిల్ల – 59, రంగారెడ్డి – 312, సంగారెడ్డి – 114, సిద్దిపేట్ – 161, సూర్యాపేట్ – 105, వికారాబాద్ – 153, వనపర్తి – 85, వరంగల్ రూరల్ – 105, వరంగల్ అర్బన్ – 194, యాదాద్రి భువనగిరి – 117 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Also read:

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ డీ.వై. చంద్రచూడ్ కి కరోనా వైరస్ పాజిటివ్, పిటిషన్ల విచారణలో ఇక జాప్యం తప్పదంటున్న లాయర్లు

Banks Working Timings: క‌ర్ఫ్యూ, లాక్ డౌన్ నేప‌థ్యంలో ఆంధ్రా, తెలంగాణ‌లో బ్యాంకు ప‌నివేళల్లో మార్పులు

TS Covid : తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోందన్న కేంద్ర మంత్రి.. కరోనా సామాగ్రి కోటాను పెంచి సరఫరా చేస్తామని హామీ