AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Covid : తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోందన్న కేంద్ర మంత్రి.. కరోనా సామాగ్రి కోటాను పెంచి సరఫరా చేస్తామని హామీ

Central Minister Harsh Vardhan : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర మంత్రి హర్షవర్దన్ సంతృప్తి వ్యక్తం చేశారు.

TS Covid : తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోందన్న కేంద్ర మంత్రి..  కరోనా సామాగ్రి కోటాను పెంచి సరఫరా చేస్తామని  హామీ
Harish Rao
Venkata Narayana
|

Updated on: May 12, 2021 | 8:36 PM

Share

Central Minister Harsh Vardhan : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర మంత్రి హర్షవర్దన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు కావాల్సిన ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక్సీన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తదితర కరోనా సంబంధిత మందులు సామాగ్రి కోటాను పెంచి సత్వర సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ వివిధ రాష్ట్రాలతో ఇవాళ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంత్రి హరీష్ రావు వీడియో కాన్పరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మొదటి వేవ్ కరోనా సందర్భంలో వున్న మౌలిక వసతులను రెండో వేవ్ వరకు రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచిందని వివరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సిఎం కెసిఆర్ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ డోర్ టు డోర్ కొవిడ్ పీవర్ సర్వే ను నిర్వహిస్తుందని వివరించారు. అంగన్ వాడీ, ఆశా వర్కర్లు, ఎఎన్ఎం సిబ్బంది తో కూడిన 27,039 టీంలు ఇంటింటికి వెళ్లి జ్వర పరీక్షలు నిర్వహిస్తున్నాయని కేంద్ర మంత్రికి తెలిపారు. అనుమానితులకు కరోనా నియంత్రిత మందులతో కూడిన హెల్త్ కిట్లను ఉచితంగా ప్రభుత్వం అందచేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో నేటినుంచి లాక్ డౌన్ అమలవుతున్నదని కేంద్రమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆదేశాలమేరకు, రాష్ట్రం తరఫున కేంద్రమంత్రికి మంత్రి హరీష్ రావు పలు విజ్జప్తులను చేశారు.

తెలంగాణ మెడికల్ హబ్ గా మారిన నేపథ్యంలో, తెలంగాణలోని స్థానిక కరోనా రోగులకు అదనంగా ఇతర రాష్ట్రాలనుంచి కరోనా రోగుల రద్దీ విపరీతంగా పెరిగిందన్నారు. తెలంగాణ చుట్టుపక్కల వున్న మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలనుంచి కరోనా పాజిటివ్ గా నమోదైన వారు తెలంగాణ కు వచ్చి ట్రీట్ మెంటు పొందుతున్నారని తెలిపారు. వారి వారి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ గా లెక్కింప బడి రికార్డుల్లోకి ఎక్కిన వారు తెలంగాణ కు వచ్చి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలో కొవిడ్ పాజిటివ్ లెక్కల్లో తేడా వస్తున్నదని తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిందన్నారు. తెలంగాణ కు జనాభా ప్రాతిపదిక కాకుండా, ఇతర రాష్ట్రాల పాజిటివ్ కేసులను కలుపుకుని, రాష్ట్రంలో ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ కేసుల బెడ్ల సంఖ్య ఆధారంగా మందులు ఆక్సిజన్ ఇతరాల కేటాయింపులు జరపాలని మంత్రి కోరారు. తెలంగాణ లో మందుల కొరత పెరగడానికి ఈ లెక్కల్లో తేడా ప్రధాన కారణమని కేంద్ర మంత్రికి హరీష్ రావు వివరించారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించడం విశేషం.

Read also : Alla Nani : బంధుత్వాన్ని ఉపయోగించి బాబు వ్యాక్సిన్లు రప్పిస్తే మాకు సమ్మతమే : ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని